జగన్ సర్కార్‌కి షాక్ ఇచ్చిన ఏబీ వెంకటేశ్వరరావు.. క్యాట్‌లో పిటీషన్..!

Thursday, February 13th, 2020, 04:40:20 PM IST

జగన్ సర్కార్‌కు మాజీ ఇంటలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు షాక్ ఇచ్చారు. తనపై ఏపీ ప్రభుత్వం విధించిన సస్పెన్షన్‌పై ఆయన సెంట్రల్ అప్పిలేట్ ట్రైబ్యూనల్‌ను (క్యాట్) ఆశ్రయించారు. ఏపీ ప్రభుత్వం తనను సస్పెండ్ చేయడం చట్ట విరుద్దమని, గత ఏడాది మే 31 నుంచి తనకు జీతం కూడా చెల్లించకుండా వేధిస్తున్నారని పిటీషన్‌లో పేర్కొన్నారు.

అయితే రాజకీయ వత్తిళ్ళ కారణంగానే తనపై సస్పెన్షన్ వేటు వేశారని, తనపై ఏపీ ప్రభుత్వం విధించిన సస్పెన్షన్‌పై స్టే విధించాలని క్యాట్‌ను కోరారు. అయితే ఈయన ఏడీజీపీగా పనిచేసిన కాలంలో నిఘా పరికరాల కొనుగోలులో అక్రమాలకు పాల్పడినట్టు డీజీపీ ప్రభుత్వానికి నివేదిక పంపారు. అయితే ఈ విషయంపై క్రమశిక్షణ చర్యలు తీసుకునేందుకే ఆయనపై సస్పెన్షన్ వేటు వేసినట్టు ఏపీ ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలలో తెలిపింది. అయితే గత టీడీపీ అధికారంలో ఏబీ వెంకటేశ్వర రావు ఇంటెలిజన్స్ చీఫ్‌గా వ్యవహరించగా, వైసీపీ ఫిర్యాదు మేరకు ఎన్నికల సంఘం గత ఎన్నికలకు ముందు ఆయన్ను ఇంటెలిజన్స్ చీఫ్ పదవి నుంచి బదిలీ చేసిన సంగతి తెలిసిందే.