న్యూ టెక్‌ : 4డి-ఐమ్యాక్స్‌లో `ఏబిసిడి- 3`?

Friday, April 13th, 2018, 11:35:09 PM IST

సినిమా వ్యూయింగ్ విధానం ఇప్పుడు పూర్తిగా మారిపోతోంది. 2డికి టాటా చెప్పి, 3డికి ఆడియెన్ ఫిక్స‌యిపోతున్నాడు. అయితే ఆ ఆక‌లి అక్క‌డితో ఆగిపోలేదు. ఇంకా ఇంకా పెరుగుతోంది. సాంకేతికంగా అత్యున్న‌త ప్ర‌మాణాల్ని అందిపుచ్చుకునేందుకు మ‌న మేక‌ర్స్ ఏమాత్రం వెన‌క్కి త‌గ్గ‌డం లేదు. ఆ క్ర‌మంలోనే వినిపిస్తున్న మ‌రో కొత్త మాట 4డి సినిమా వ్యూయింగ్ విధానం. దీనికి ఐమ్యాక్స్ ఫార్మాట్ కూడా ఉంటుందిట‌.

ప్ర‌స్తుతం దీనిపై ప్ర‌ఖ్యాత బాలీవుడ్ కొరియోగ్రాఫ‌ర్ కం డైరెక్ట‌ర్ రెమో డి.సౌజా రీసెర్చ్ చేసేందుకు విదేశాల‌కు ప‌య‌న‌మ‌య్యాడు. 4డి విధానంలో సంక్లిష్ఠ‌త‌ల్ని అర్థం చేసుకుని, అందులో కెమెరాల్ని, ఇత‌ర‌త్రా ఎక్విప్‌మెంట్‌ని ఎలా ఉప‌యోగిస్తున్నారో తెలుసుకుని తిరిగి వ‌స్తాడుట‌. అటుపై త‌న క్రేజీ ప్రాజెక్ట్ ఏబీసీడీ 3 చిత్రాన్ని 4డిలో తెర‌కెక్కించే స‌న్నాహాల్లో ఉన్నాడ‌ని తెలుస్తోంది. ఏబీసీడీ 2 చిత్రాన్ని 3డిలో తెర‌కెక్కించి పెద్ద స‌క్సెసైన రెమో ఈసారి మ‌రింత కొత్త టెక్నాల‌జీని ప‌రిచ‌యం చేయాల‌ని భావిస్తున్నాడు. ఒక‌వేళ ఇది స‌క్సెసైతే ఇదే ప‌ద్ధ‌తి ఇత‌ర‌త్రా భాష‌ల్లోనూ ఆస్కారం ఉంటుంది. 3డిలో కేవ‌లం ఒకే చోట క‌ద‌ల‌కుండా ఉండే ఆడియెన్‌, 4డి విధానంలో కుర్చీతో పాటు ర‌క‌ర‌కాల యాంగిల్స్‌లో క‌దులుతుంటాడు. నేరుగా విజువ‌ల్స్ లైవ్‌లో తాను కూడా పూర్తిగా ఒక భాగం అయిపోతాడు.

  •  
  •  
  •  
  •  

Comments