అభిమ‌న్యుడు 3రోజుల్లో 6.5 కోట్లు

Monday, June 4th, 2018, 11:29:49 AM IST

విశాల్ `అభిమ‌న్యుడు` తెలుగు రాష్ట్రాల్లో వ‌సూళ్ల త‌డాఖా చూపిస్తోంది. ఈ సినిమా 3రోజుల్లో 6.4 కోట్లు వ‌సూలు చేసి సెన్సేష‌న్స్ సృష్టించింది. మ‌రోవైపు నాగ్‌-ఆర్జీవీల ఆఫీస‌ర్‌, రాజ్‌త‌రుణ్ రాజుగాడు డిజాస్ట‌ర్లుగా నిలిచాయి.

అభిమ‌న్యుడు తొలి వీకెండ్ వ‌సూళ్ల వివ‌రం ప‌రిశీలిస్తే… నైజాం -2.9కోట్లు, సీడెడ్‌-69ల‌క్ష‌లు, వైజాగ్‌-76ల‌క్ష‌లు, గుంటూరు-54ల‌క్ష‌లు, కృష్ణ‌-57ల‌క్ష‌లు, నెల్లూరు-28ల‌క్ష‌లు, తూ.గో జిల్లా-40ల‌క్ష‌లు, ప‌.గో జిల్లా-26ల‌క్ష‌లు క‌లెక్ట‌యింది. 3రోజుల్లో మొత్తం వ‌సూళ్లు 6.4కోట్లుగా తేలింది. ఇక ఓవ‌ర్సీస్ వ‌సూళ్లు దీనికి అద‌నం అని చెబుతున్నారు. పి.ఎస్‌.మిత్ర‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ సినిమాని నిర్మాత‌-పంపిణీదారుడు హ‌రి రిలీజ్ చేశారు.

  •  
  •  
  •  
  •  

Comments