ఆఫీస‌ర్‌కి అభిమ‌న్యుడు లెస్స‌న్స్‌

Sunday, June 3rd, 2018, 09:37:43 PM IST


విష‌యం ఉంటే భాష‌తో ప‌ని లేకుండా జ‌నం ఆద‌రిస్తార‌ని మ‌రోసారి ప్రూవైంది. స్ట్రెయిట్ తెలుగులో తెర‌కెక్కిన ఆఫీస‌ర్ బ‌కెట్ తంతే, పొరుగు భాష‌లో తెర‌కెక్కి అనువాదంగా రిలీజైన `అభిమ‌న్యుడు` క‌లెక్ష‌న్ల దుమ్ము దులుపుతోంది. క‌థ‌, క‌థ‌నం, సౌండ్‌, ద‌ర్శ‌కుడిలో ఒగ‌రు పొగ‌రు ఉండాల‌న్న ప్రాథ‌మిక సూత్రాన్ని ఆఫీస‌ర్ కాల‌దన్నితే, ఆ నాలుగు ల‌క్ష‌ణాల్ని అందిపుచ్చుకుని అభిమన్యుడు క‌లెక్ష‌న్ల సునామీ సృష్టిస్తున్నాడు. హీరో విశాల్ తెలుగు ఆడియెన్ నుంచి రోజుకో కోటి లాక్కుంటున్నాడు. ఆర్జీవీ కంటే వెయ్యి రెట్లు బెట‌ర్ కంటెంట్‌తో సినిమాని తెర‌కెక్కించ‌డంలో పి.ఎస్‌.మిత్ర‌న్ గొప్ప విజ‌యం సాధించాడు. ఈ లెస్స‌న్ మామూలు లెస్స‌న్ కాదు. ఆర్జీవీ ఇక‌నైనా సినిమా అంటే లైట‌ర్ వెయిన్‌లో న‌చ్చింది తీసేయ‌డ‌మే కాద‌ని గుణ‌పాఠం నేర్పాడనే చెప్పాలి. ఆర్జీవీ ఎంత‌టి సీనియ‌ర్ ద‌ర్శ‌కుడు అయినా ఇటీవ‌లి కాలంలో క‌థ‌, కంటెంట్ విష‌యంలో, ఉక్కిరిబిక్కిరి చేసే స్క్రీన్ ప్లే విష‌యంలో ఎందుక‌నో అంత శ్ర‌ద్ధ చూపించ‌డం లేద‌ని మ‌రోసారి ప్రూవైంది.

ఇక విశాల్ అభిమ‌న్యుడు డే1 లో కోటికి అటూ ఇటూగా వ‌సూలు చేసి తెలుగు రాష్ట్రాల్లో స‌త్తా చాటింది. నైజాం-22ల‌క్ష‌లు, సీడెడ్‌-11ల‌క్ష‌లు, ఇత‌ర చోట్ల -13ల‌క్ష‌లు, తూ.గో-ప‌.గో క‌లుపుకుని-11ల‌క్ష‌లు, గుంటూరు-కృష్ణ‌-25ల‌క్ష‌లు, నెల్లూరు -7ల‌క్ష‌లు.. ఓవ‌రాల్ గా 90ల‌క్ష‌లు వ‌సూలు చేసింది ఈ చిత్రం. ఈ మూడ్రోజుల సెల‌వుల్లోనే ఈ చిత్రం 4-5కోట్లు వ‌సూలు చేయ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది. కంటెంటే మ‌రోసారి నెగ్గింది. ఈ విజ‌యం విశాల్‌కి పెద్ద బూస్ట్ ఇచ్చింద‌నే చెప్పాలి.

  •  
  •  
  •  
  •  

Comments