బిగ్‌బి డాడ్‌కి డాడ్‌.. అభికి ముత్తాత‌!?

Thursday, March 22nd, 2018, 09:00:12 PM IST

బిగ్‌బి డాడ్‌కి డాడ్‌.. అభికి ముత్తాత‌!? ఎలా ఉంటాడో చూడాల‌ని ఉందా? అయితే ఈ ఫోటో చూడాలి. ఈ పోటోలో మూడు త‌రాల బిగ్‌బి వంశ వృక్షం క‌నిపిస్తోంది. ఒక‌టో ఫొటోలో ఉన్నది నా ముత్తాత… రెండో ఫొటోలో నాన్న… మూడో ఫొటోలో నేను… మూడు తరాల ఫోటో.. అంటూ ట్వీట్ చేశారు అభిషేక్ బ‌చ్చ‌న్‌. ఇదే ఫోటోని బిగ్‌బి అమితాబ్ బ‌చ్చ‌న్ ట్విట్ట‌ర్‌లో షేర్ చేశారు.

అభిషేక్ బ‌చ్చ‌న్ `మ‌న్మ‌ర్జియా` మూవీ లుక్ ఆవిష్క‌రిస్తూ త‌న ఫ్యామిలీ పోటోని ఇలా ఆవిష్క‌రించారు బిగ్‌బి. తాత ఖ‌జాన్ సింగ్ సూరి .. బిగ్‌బి అమితాబ్‌.. అభిషేక్ బ‌చ్చ‌న్ .. సేమ్ టు సేమ్ సిక్కు గెట‌ప్‌లో క‌నిపించారు ఈ ఫోటోలో. అనురాగ్ క‌శ్య‌ప్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన `మన్మర్జియా `సెప్టెంబర్‌7న రిలీజ్ కానుంది.