అమితాబ్ కొడుకు అభిషేక్ బచ్చన్‌కి కూడా కరోనా పాజిటివ్..!

Sunday, July 12th, 2020, 01:59:54 AM IST


బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్‌కి కరోనా పాజిటివ్ వచ్చినట్టు కొద్ది సేపటి క్రితమే తెలిసింది. అయితే నా కుటుంబ సభ్యులతో పాటు తన దగ్గర పనిచేసే సిబ్బంది కూడా కరోనా పరీక్షలు చేయించుకున్నారని వారి ఫలితాలు ఇంకా రావాల్సి ఉందని, తనకు గత 10 రోజులుగా దగ్గరగా ఉన్న వారు కూడా కరోనా పరీక్షలు చేయించుకోవాలని అభ్యర్థిస్తూ అమితాబ్ ట్వీట్ కూడా చేశారు.

అయితే తాజాగా అమితాబ్ కుమారుడు హీరో అభిషేక్ బచ్చన్‌కి కూడా కరోనా పాజిటివ్ వచ్చినట్టు నిర్ధారణ అయ్యింది. అయితే తనకు, తన ఫాదర్‌కి కొద్దిగా కరోనా లక్షణాలు కనబడడంతో ఉదయం ఆసుపత్రిలో చేరామని పరీక్షలు చేయగా మా ఇద్దరికి పాజిటివ్ అని రిపోర్ట్ వచ్చిందని చెప్పుకొచ్చారు. ఇకపోతే అమితాబ్ భార్య జయా బచ్చన్, కోడలు ఐశ్వర్యరాయ్ బచ్చన్‌లకు కరోనా నెగిటివ్ అని తేలింది.