అభిషేక్ పిక్చ‌ర్స్‌కి అంత‌ర్జాతీయ‌ అవార్డ్‌

Thursday, September 29th, 2016, 09:17:24 AM IST

ktr-with-wife
నైజాం మార్కెట్లో ఆ న‌లుగురికి చెక్ పెడుతున్న సంస్థ‌గా అభిషేక్ పిక్చ‌ర్స్ పేరు మార్మోగిపోతోంది. ఇటీవ‌లి కాలంలో రిలీజైన అన్ని టాప్ మూవీస్‌ని నైజాంలో రిలీజ్ చేస్తూ ప్ర‌త్య‌ర్థికి కునుకులేకుండా చేస్తున్నా ఈ కాంపిటీటివ్ సంస్థ వెన‌క కేసీఆర్ కోడ‌లు (కేటీఆర్ వైఫ్‌) పెట్టుబ‌డులు ఉన్నాయ‌న్న‌ది బ‌హిరంగ ర‌హ‌స్యంగా చెప్పుకుంటున్నారు. సీఎం తెలంగాణ‌లో సినిమా బిజినెస్‌పై క‌న్నేశారు. అయితే దాని వెన‌క తెలివిగా పావులు క‌దుపుతున్నారు కేటీఆర్‌.

అభిషేక్ పిక్చ‌ర్స్ పేరుతో సాగుతున్న ఈ వ్యాపారంలో తెలంగాణ రాజ‌కీయ‌నేత‌ల పెట్టుబ‌డులు ఉండ‌డంతో అదో ప్ర‌తిష్ఠాత్మ‌క సంస్థ‌గా ఎదుగుతోంద‌న్న ప్ర‌చారం సాగుతోంది. లేటెస్టుగా అభిషేక్ పిక్చ‌ర్స్ ఐఎఫ్ఎ (ఇంట‌ర్నేష‌న‌ల్ ఫిలిం బిజినెస్ -2016) అవార్డును ద‌క్కించుకోవ‌డం చ‌ర్య‌కొచ్చింది. ఈ సంద‌ర్భంగా సంస్థ కార్యాల‌యంలో అభిషేక్‌, బోయ‌పాటి శ్రీ‌ను స‌హా ప‌లువురు పూజా కార్య‌క్ర‌మాల‌తో పాటు సంబ‌రాల్లో పాల్గొన్నారు.