ప్రజలను దోచుకోవడానికే రాజీకీయాలలోకి వస్తున్నానంటున్న యువ నేత

Saturday, January 28th, 2017, 01:38:28 PM IST

man
ఎవరైనా కొత్తగా రాజకీయాలలోకి రావాలనుకుంటే ప్రజలను మభ్యపెట్టడానికి తాము ప్రజాసేవ చేయడానికి వచ్చామని, తమను గెలిపిస్తే మీకు అది చేస్తాం… ఇది చేస్తాం.. అని ఆశలు కల్పిస్తారు. కానీ ఉత్తరప్రదేశ్ లోని దక్షిణ ఆగ్రా నియోజక వర్గంలోని స్వతంత్ర్య అభ్యర్థిగా పోటీ చేస్తున్న గోపాల చౌదరి మాత్రం అందుకు భిన్నంగా తాను డబ్బు సంపాదించేందుకే రాజకీయాలలో అడుగుపెట్టానని, ఎమ్మెల్యేగా ఎన్నికైతే లభించే ప్రయోజనాలను పొందేందుకే రాజకీయాలలోకి వచ్చానని బహిరంగంగా ఒప్పుకున్నాడు.

ఈ రోజుల్లో అందరూ డబ్బు సంపాదించడానికే రాజకీయాలలోకి వస్తారని, గెలిచినా తరువాత ఖరీదైన భవనాలను నిర్మించుకుంటారని చౌదరి అంటున్నారు. తనకు రాజకీయ అనుభవం లేదని, ఎమ్మెల్యే అయితే డబ్బు ఎలా సంపాదించుకోవాలో కూడా తనకు తెలీదని, అయితే పక్కన ఉండే అధికారులు తనకు డబ్బు సంపాదించడం నేర్పుతారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. దేశంలోని 125 కోట్ల మంది ప్రజలను పిచ్చివాళ్లను చేసి ఒక వ్యక్తి ప్రధానమంత్రి అయ్యారు. ఆయనలో ఏదో ప్రతిభ ఉంది. అందుకే ఆయన అడుగుజాడల్లోనే తాను నడవాలి అనుకుంటున్నట్టు చౌదరి అన్నారు.