ఆచారి యాత్ర వాయిదా వేసినట్టున్నాడే ?

Wednesday, January 24th, 2018, 05:17:21 PM IST

మంచు విష్ణు – దర్శకుడు నాగేశ్వర్ రెడ్డి కలిసి హ్యాట్రిక్ హిట్ కోసం సిద్ధం అవుతున్నారు . ఇప్పటీకే దేనికైనా రెడీ , ఈడోరకం ఆడోరకం సినిమాలతో మంచి విజయాన్ని అందుకున్న ఈ జోడి ఈ సారి మరో క్రేజీ హిట్ కోసం రెడీ అయ్యారు. ఆచారి అమెరికా యాత్ర పేరుతొ రూపొందిన ఈ చిత్రం విడుదలకు సిద్ధం అయింది. ఈ నవ్వుల యాత్రను ముందే మొదలుపెట్టాలని అనుకున్నారు, నిజానికి ఈ నెల 26న విడుదల చేయాలనీ ప్లాన్ చేసారు .. కానీ ఈ సినిమా ఎందుకో వాయిదా పడింది .. ఫిబ్రవరి 16న విడుదల చేస్తారట. సాంకేతిక కారణాల వల్లే సినిమాను వాయిదా వేయాల్సి వచ్చిందని యూనిట్ తెలిపింది. ఇప్పటికే మంచి అంచనాలు పెంచుకున్న ఈ సినిమాతో హ్యాట్రిక్ హిట్ ఖాయమనే నమ్మకంతో ఉన్నాడు విష్ణు.