బ్రేకింగ్: సంచలనం సృష్టిస్తున్న వీసీ అరెస్ట్…చంద్రబాబే కారణమా?

Monday, October 21st, 2019, 11:12:45 AM IST

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పై ప్రేమ వల్ల చాలామంది ఇబ్బందులు పడుతున్నారు. అయితే ఈసారి ప్రముఖ ఆచార్య ఎన్జీ రంగా అగ్రికల్చర్ యూనివర్సిటీ విసి వల్లభనేని దామోదర్ ని పోలీసులు అరెస్ట్ చేసారు. అక్కడే పని చేసే అటెండర్ ని ఉద్యోగం నుండి తీసివేయడమే కాకుండా కులం పేరుతో దూషించాడని పోలీసులకి ఫిర్యాదు అందడంతో అరెస్ట్ చేసినట్లు తెలుస్తుంది. అయితే గతం లోనూ ఇలాంటి చర్యే అక్కడ జరిగిందనీ, కానీ అప్పటి చంద్రబాబు ప్రభుత్వం ఈ విషయం లో నేరుగార్చిందని అక్కడి ఉద్యోగులు చెబుతున్నారు.

విసి కి టీడీపీ అంటే ప్రేమ అని, అందుకే ఒక సామజిక వర్గానికి చెందిన వారిని మాత్రమే అయన ప్రోత్సహిస్తున్నారని అక్కడి ఉద్యోగులు చెబుతున్నారు. అయితే ఇక్కడ కులం కంటే కూడా రాజకీయంగా నే ఎక్కువ చర్యలు జరుగుతున్నాయని అర్ధం అవుతుంది. అక్కడి వైసీపీ అంటే అభిమానం వున్న వాళ్ళని విసి ఉద్యోగాల నుండి తొలగించడం దుర్భషలాడటం వంటివి జరుగుతున్నాయని చెబుతున్నారు అక్కడి ఉద్యోగులు. విసి వలన నష్టపోయిన ఉద్యోగులు గవర్నర్కి, సీఎం కి ఫిర్యాదు చేసారు ఉద్యోగులు. విసి పై వస్తున్న ఫిర్యాదుల విచారణ కోసం ప్రద్యుమ్న ని నియమించినట్లు తెలుస్తుంది.