వైసీపీ ప్రభుత్వం ఫై సంచలన వ్యాఖ్యలు చేసిన అచ్చెన్నాయుడు

Tuesday, December 3rd, 2019, 02:54:19 PM IST

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ప్రయాణిస్తున్న బస్సుపై దాడి కి కారణం వైసీపీ నే కారణమంటూ టీడీపీ నేత అచ్చెన్నాయుడు అన్నారు. అయితే ఈ సంఘటన ఫై టీడీపీ నేతలు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందర్ కు ఫిర్యాదు చేయడం జరిగింది. సంఘటనకు సంబందించిన పూర్తీ వివరాలను గవర్నర్ కి వివరించడం జరిగింది. అయితే రాజధానిపై కుట్రపూరితంగానే వైసీపీ పార్టీ అవాస్తవాలు వ్యాపింపచేస్తున్నారని అచ్చెన్నాయుడు మండిపడ్డారు. వాస్తవాలను ప్రజలకు తెలియజేయడానికి అమరావతి పర్యటన చేసారని తెలిపారు. అయితే గవర్నర్ ఫిర్యాదు చేయడం పట్ల సానుకూలంగా స్పందించారని అన్నారు. అయితే వైసీపీ మంత్రులు నేతల ఫై విమర్శలు చేసారు అచ్చెన్నాయుడు.

అయితే వైసీపీ నేతలు బయటినుండి జనాల్ని తీసుకొచ్చి చంద్రబాబు ఫై దాడి చేయించారని అన్నారు. మంత్రి కొడాలి నాని ఫై అనుచిత వ్యాఖ్యలు చేసిందంటూ ఒక మహిళని అరెస్ట్ చేసారు. బాధ చెప్పుకుంటున్న మహిళని అరెస్ట్ చేయడం దారుణం అని అన్నారు. కొడాలి నాని అసభ్య పదజాలం వాడినప్పటికీ ఎందుకు అరెస్ట్ చేయలేదు అని ప్రశ్నించారు.