సైన్స్ ఫిక్షన్ కథతో నాని నెక్స్ట్ ఫిల్మ్…

Wednesday, April 18th, 2018, 03:06:43 PM IST

నేచుర‌ల్ స్టార్ నాని ప్ర‌యోగాలు చేయ‌డంలో ఎప్పుడు ముందుంటాడ‌నే సంగ‌తి తెలిసిందే. వ‌రుస‌గా 8 హిట్స్ కొట్టిన నానికి కృష్ణార్జున యుద్ధం చిత్రం కాస్త నిరాశ‌ప‌ర‌చింది. అయితే త‌న త‌దుపరి సినిమాతో మాత్రం ప‌క్కా హిట్ కొట్టాల‌నే క‌సితో ఉన్నాడు. అయితే నాని త‌దుప‌రి చిత్రాన్ని అవసరాల శ్రీనివాస్ లేదా విక్రమ్‌ కె కుమార్ లేదా హను రాఘవపూడి లాంటి టాలెంట్ ఉన్న‌ దర్శకులు తెర‌కెక్కిస్తార‌ని ప్ర‌చారం జ‌రుగుతుంది. కాని నాని మాత్రం ముందుగా విక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో ప్రయోగాత్మ‌క చిత్రం చేయాల‌ని భావిస్తున్నాడ‌ట‌. సూర్య ప్ర‌ధాన పాత్ర‌లో విక్ర‌మ్ కుమార్‌ తెర‌కెక్కించిన 24 చిత్రం సైన్స్ ఫిక్ష‌న్ నేప‌థ్యంలో రూపొంది సంచ‌ల‌న విజ‌యం సాధించింది. ఇప్పుడు నాని కూడా అలాంటి క‌థ‌తోనే సినిమా చేద్ధామ‌ని అంటున్నాడ‌ట‌. మ‌రి దీనిపై త్వ‌ర‌లోనే క్లారిటీ రానుంది. ప్ర‌స్తుతం నాని కింగ్ నాగ్‌తో క‌లిసి మ‌ల్టీస్టార‌ర్ ప్రాజెక్ట్ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. భ‌లే మంచి రోజు, శ‌మంత‌క‌మ‌ణి చిత్రాల ద‌ర్శ‌కుడు శ్రీరామ్ ఆదిత్య ద‌ర్శ‌క‌త్వంలో ఈ మూవీ రూపొందుతుంది.

  •  
  •  
  •  
  •  

Comments