వ్యాపారులకు నటుడు అలీ విజ్ఞప్తి – దయచేసి మీరు కూడా అర్థం చేసుకోండి…?

Wednesday, March 25th, 2020, 09:02:45 AM IST

దేశమంతా కూడా భయంకరమైన కరోనా వైరస్ వలన తీవ్రమైన భయాందోళనకు గురవుతున్న ఇలాంటి సమయంలో కొందరు చౌకదారు వ్యాపారులు అతి తెలివితో నిత్యావసరాలు, కూరగాయల ధరలు అమాంతం పెంచేసి, ఎక్కువ డబ్బు సంపాదించాలనే ఆలోచనలో ఉన్నారు. అయితే ఈ విషయంలో స్పందించిన ప్రముఖ నటుడు అలీ మాట్లాడుతూ… వ్యాపారులు డబ్బు సంపాదించడానికి ఇది సరైన సమయం కాదని, ఒకవైపు కరోనా వైరస్ వలన ప్రజలందరూ కూడా ఇప్పటికే భయాందోళనకు గురవుతున్నారని, కాగా వ్యాపారులు మరింతగా ప్రజలను ఇబ్బంది పెట్టకూడదని నటుడు అలీ వ్యాపారులందరికి కూడా విజ్ఞప్తి చేసుకున్నారు.

అంతేకాకుండా సాధారణ రేట్లకు నిత్యావసరాలను అమ్మి వ్యాపారులు కూడా తమ మానవత్వాన్ని చాటుకోవాలని అలీ వాఖ్యానించారు. కాగా భయంకరమైన కరోనా వైరస్ వ్యాపిస్తున్న తరుణంలో, ఆ వైరస్ నివారణకై రెండు తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలకు చెరోక లక్ష రూపాయల విరాళం ఇచ్చి తన మానవత్వాన్ని చాటుకున్నారు. ఇకపోతే భయంకరమైన కరోనా వైరస్ మన దేశం నుంచి వెళ్లిపోవాలని తాను గత 10 రోజులుగా ఇంట్లోనే నమాజ్ చేస్తున్నానని నటుడు అలీ వ్యాఖ్యానించారు. కాగా ప్రజలందరూ కూడా ప్రధాని మోడీ ఇచ్చిన పిలుపు మేరకు సహకరించాలని, అందరం మూకుమ్మడిగా కరోనాని తరిమికొట్టాలని నటుడు అలీ వాఖ్యానించారు.