వేధింపుల కేసులో సినీ నటుడి అరెస్ట్ !

Tuesday, January 30th, 2018, 11:09:41 AM IST

ప్రముఖ క్యారక్టర్ నటుడు సామ్రాట్ రెడ్డిని పోలీస్ లు గత రాత్రి అరెస్ట్ చేశారు. ఆయన భార్య హరిత రెడ్డి మాదాపూర్ పోలీస్ స్టేషన్ లో తనను కొన్నాళ్ల నుండి భర్త సామ్రాట్ అదనపు కట్నం కోసం వేధింపులకు గురిచేస్తున్నాడని సెక్షన్ 498/A క్రింద కేసు పెట్టింది. చాలా రోజుల నుండి సామ్రాట్ కు ఆయన భార్య కు మధ్య విబేధాలు ఉన్నాయని ఈ గొడవ మరింత ముదరడంతో ఆయన భార్య ఇదివరకు ఆయన పై వేధింపుల కేసు పెట్టగా, కొన్నాళ్ళకు మెల్లగా గొడవలు సర్దుమణిగి ఇద్దరు ఒక్కటయ్యారని చెప్తున్నారు. అయితే నిన్న మధ్యాహ్నం తన భార్యను కలవటానికి ఇంటికి వెళ్లారు సామ్రాట్ రెడ్డి, ఆయన తన ఇంటికి వచ్చింది తనను కలవడం పేరుతో దొగతనం చేయడానికని ఆయన భార్య నిన్న అందులో భాగంగా పోలీస్ కేసు పెట్టడం గమనార్హం. ఈ విషయమై సామ్రాట్ రెడ్డి స్పందిస్తూ కావాలనే తనను హరిత రెడ్డి దొంగతనం కేసు లో ఇరికించిందని చెప్పుకొచ్చారు. పోలీస్ లు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. నటుడిగా పంచాక్షరీ లో అనుష్క భర్తపాత్ర లో నటించారు సామ్రాట్, అలానే దేనికైనా రెడీ, తకిట తకిట ఆయన నటించిన చిత్రాలు…