సంచలన నిర్ణయం : ఎన్టీఆర్ బయోపిక్ దర్శకత్వంపై బాలయ్య …

Thursday, April 26th, 2018, 10:54:13 AM IST

టాలీవుడ్ క్రియేటివ్ దర్శకుడు తేజ సంచలన నిర్ణయం తీసుకున్న విష‌యం తెలిసిందే. విశ్వ‌విఖ్యాత న‌టుడు ఎన్టీఆర్ బయోపిక్‌ను తేజ దర్శకత్వంలో ఆయన తనయుడు బాలకృష్ణ హీరోగా గత నెల 29న అంగరంగ వైభవంగా రామకృష్ణా స్టూడియోస్ లో ప్రారంభం అయిన విషయం తెలిసిందే.

అయితే ఈ సినిమా త్వరలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం అవ్వాల్సి ఉంది … ఏమైందో ఏమోకానీ అనూహ్యంగా ఆ సినిమాకి దర్శకత్వం వహించే భాద్యతల నుంచి ఆయన తప్పుకున్తున్నట్లు ప్రకటించటం సంచలనంగా మారింది …అయితే ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించ తలబెట్టిన ఆ సినిమా కి న్యాయం చేయలేను అన్న తలంపుతో తానే స్వయంగా దర్శకత్వ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు

అయితే ఈ నేప‌ధ్యంతో బాల‌కృష్ణ తీసుకున్న నిర్ణ‌యం సినీ వ‌ర్గాల్లో హాట్ టాపిక్ అయ్యింది. ప్రతిష్టాత్మక ఎన్టీఆర్ బయోపిక్’ చిత్రం నుంచి డైరెక్టర్ స్థానం నుంచి తేజ తప్పుకోవడంతో బాలకృష్ణ ఆ బాధ్యతను చేపట్టనున్నట్టు విశ్వసనీయంగా తెలుస్తోంది. తన స్వీయ దర్శకత్వంలోనే ‘ఎన్టీఆర్ బయోపిక్’ సినిమాను తీయాలని అనుకుంటున్నట్టు సినీ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతుంది. భారీ స్టార్ కాస్టింగ్ తో నిర్మితమవుతున్న ఈ చిత్రంలో బాలయ్య ఎన్టీఆర్ పాత్రలో నటిస్తున్న విష‌యం తెలిసిందే.

ఇక గతంలో నర్తనశాల చిత్రానికి దర్శకత్వం వహించాలనుకున్నారు బాలయ్య.. అయితే ఆ సినిమా మధ్యలోనే ఆగిపోయింది. తాజాగా ఎన్టీఆర్ బయోపిక్ నుంచి అనూహ్యంగా తేజ తప్పుకోవడంతో ఆ బాధ్యతను తన భుజాన వేసుకున్నారు బాలకృష్ణ. కాగా గతంలో ఎన్టీఆర్ సినిమాల్లో నటిస్తూనే దర్శకత్వం కూడా వహించారు. అందులో ముఖ్యంగా దానవీర సూరకర్ణ , నర్తనశాల, పోతులూరి వీరబ్రహ్మగారి చరిత్ర వంటి సంచలన చిత్రాలకు దర్శకత్వం వహించారు. మ‌రి బాల‌య్య తీసుకున్న నిర్ణ‌యం ఎలాంటి రిజ‌ల్ట్ ఇస్తుందో చూడాలి.

  •  
  •  
  •  
  •  

Comments