సినిమా చూసిన తరువాత తెలిసింది.. అసలు విషయం..!

Tuesday, February 28th, 2017, 10:11:28 PM IST


హీరో ధనుష్ ఎవరి కొడుకన్న విషయం ఓ కొలిక్కి రావడం లేదు.హీరో ధనుష్ తమ కుమారుడే అని కదిరేశన్, మీనాక్షిదంపతులు పిటిషన్ వేసిన విషయం తెలిసిందే. ధనుష్ తమ మూడో సంతానమని స్కూల్ లో చదువుతున్న సమయంలో చెన్నై కి పారిపోయాడని ధనుష్ తండ్రిగా చెప్పబడుతున్న కదిరేశన్ అంటున్నారు.కాగా నేడు పుట్టుమచ్చల వెరిఫికేషన్ కోసం కోర్టులో హాజరు కావాలని ధనుష్ ని హై కోర్ట్ ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నేడు ధనుష్ కోర్టులో హాజరయ్యారు. పుట్టుమచ్చల వెరిఫికేషన్ అనంతరం ఈ కేసుని మర్చి రెండుకు వాయిదా వేశారు.

అనంతరం మీడియాతో మాట్లాడిన కదిరేశన్.. ధనుష్ తన కుమారుడే అంటూ చెప్పుకొచ్చాడు. 8 వతరగతి వరకు తమవద్దనే ఉన్న ధనుష్ అంతరం చెన్నై కి పారిపోయాడని ఆయన అన్నారు. ఆ తరువాత సినిమాల్లో చూసి తమ కుమారుడిని గుర్తు పట్టినట్లు కదిరేశన్ అన్నారు. ఆ తరువాత ధనుష్ ని కలిసేందుకు చాల ప్రయత్నించామని కానీ కుదరలేదని కదిరేశన్ అన్నారు. అందుకే కోర్టుని ఆశ్రయించామని ఆయన అన్నారు.