ఆ హీరోయిన్ లైంగిక వేదింపులకోసం .. 3 కోట్ల సుపారీ ?

Thursday, September 28th, 2017, 12:37:46 PM IST


నిజంగా ఇది షాకింగ్ కలిగించే విషయమే. ఈ మద్యే కేరళ హీరోయిన్ కిడ్నప్, లైంగిక వేధింపుల సంఘటన జరిగిన సంగతి తెలిసిందే. ఈ కేసులో నిందితుడిగా మలయాళ హీరో దిలీప్ ను అరెస్ట్ చేసారు పోలీసులు. తాజాగా ఆయనను విచారించిన పోలీసులకు దిమ్మ తిరిగే జవాబులు చెప్పాడట !! ఆ హీరోయిన్ ని అపహరించి .. లైంగికంగా వేదించేందుకు కోటిన్నర ? ఒకవేళ పోలీసులకు పట్టుబడితే మరో కోటిన్నర ఇస్తానని దిలీప్ ఒప్పందం చేసుకున్నాడట ? అంటే మొత్తంగా మూడు కోట్ల రూపాయలు బేరం పెట్టినట్టు తెలిసింది. గత ఫిబ్రవరిలో స్నేహితురాలి ఇంటికి వెళుతున్న ఆ నటిని కారులో కిడ్నప్ చేసి లైంగికంగా వేధించారు, దాంతో ఆమె పిర్యాదు చేయడంతో రంగంలోకి దిగిన పోలీసులు ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు .. వారిని విచారిస్తే దిలీప్ పేరు బయటకు వచ్చింది ? మరి ఆమెతో దిలీప్ కి ఉన్న అంతర్గత పగ ఏమిటన్నది తెలియాల్సి ఉంది.

  •  
  •  
  •  
  •  

Comments