భూమిపై మోస్ట్ హ్యాండ్ సమ్ ఎవరో తెలుసా?

Saturday, September 12th, 2015, 11:51:01 AM IST


సహజంగా సౌందర్యం అనగానే మొదట గుర్తొచ్చేది ఆడవారే. ఇక వీరి అందానికి కొలమానం చేసేందుకు, ఎవరు అందగత్తెలో తేల్చేందుకు మిస్ యూనివర్స్ అని, మిస్ ఎర్త్ అని రకరకాల అందాల పోటీలను ఏర్పాటు చెయ్యడం తెలిసిందే. అయితే మరి మగవారిలో భూమిపై అత్యంత ఆకర్షణీయమైన వ్యక్తి ఎవరో ఎలా తేల్చేది? అనుకున్నారేమో.. ఒక ఆంగ్ల పత్రిక దీనిపై ఒక పోల్ ను కండక్ట్ చేసింది. ఇక ‘ఆటిట్యూడ్’ మ్యాగజైన్ కండక్ట్ చేసిన ‘హూ ఇస్ ది సెక్సియస్ట్ మ్యాన్?’ అనే ఈ పోల్ లో ‘వన్ డైరెక్షన్’ నటుడు లియామ్ పేనీకే రీడర్స్ అందరూ ఓటేశారట. ఇక దీనిపై లియామ్ స్పందిస్తూ ‘నమ్మలేకపోతున్నాను.. ఈ ఘనత నాకు ఇచ్చినందుకు ఎంతో కృతజ్ఞ్యతలు.. ఎంతో గర్వంగా ఉంది’ అంటూ హర్షం వ్యక్తం చేశాడు.