వైసీపీ పాలన పై ప్రముఖ నటుడు మోహన్ బాబు కీలక వ్యాఖ్యలు

Thursday, January 14th, 2021, 01:03:59 PM IST

తిరుమల శ్రీవారి ను దర్శించుకున్న ప్రముఖ నటుడు మోహన్ బాబు వైసీపీ పాలన పై పలు కీలక వ్యాఖ్యలు చేశారు. తిరుమల లో అవినీతి రహిత పాలన కొనసాగుతుంది అని, అవినీతికి తావు లేకుండా అందరికీ ఒకే విధంగా దర్శన భాగ్యం కల్పించడం సంతోషకరం అంటూ చెప్పుకొచ్చారు. భోగి మంటల్లో కరోనా భస్మం అయింది అంటూ వ్యాఖ్యానించారు. అయితే మోహన్ బాబు తో వచ్చిన కూతురు మంచు లక్ష్మి సైతం మీడియా తో మాట్లాడారు. నూతన సంవత్సరం లో శ్రీవారిని రెండు సార్లు దర్శించుకోవడం అదృష్టం అంటూ చెప్పుకొచ్చారు.