అసెంబ్లీ రౌడీ .. మైండ్ గేమ్ సూప‌రు!!

Monday, November 28th, 2016, 07:51:51 PM IST

mohan-babu-mudra-gada
పొలిటిక‌ల్ బ్యాక్‌డ్రాప్‌లో వ‌చ్చిన `అసెంబ్లీ రౌడీ` అప్ప‌ట్లో బంప‌ర్ హిట్‌. అలాంటి క‌థాంశాలున్న సినిమాల్లో మోహ‌న్‌బాబు అభిన‌యం ఆల్వేస్ హాట్ టాపిక్‌. ఆయ‌న ఆంగికం, ఆహార్యం వేరెవ‌రి వ‌ల్లా కానేకాదంటే అతిశ‌యోక్తి కాదు. అయితే కార‌ణం ఏదైనా .. సినిమాల్లోనే సిస‌లైన పొలిటీషియ‌న్ పాత్ర‌ల్లో మెప్పించిన మోహ‌న్‌బాబు అటుపై రియ‌ల్‌గానూ పొలిటీషియ‌న్‌గా కొన‌సాగారు. ప్ర‌స్తుతం మాత్రం రాజ‌కీయాల్లో నేరుగా క‌నిపించ‌లేదు కానీ.. చాప‌కింద నీరులా భ‌విష్య‌త్ రాజ‌కీయాల్లో కీల‌క పాత్ర పోషించేందుకు రెడీ అవుతున్నార‌ని పొలిటిక‌ల్ కారిడార్‌లో చెప్పుకోవ‌డం విశేషం.

ఇటీవ‌ల మంచు మోహ‌న్‌బాబు యాక్టివిటీస్‌పై క‌న్నేసి ఉంచిన కొంద‌రు ఓ మాట చెబుతున్నారు. మొన్నీమ‌ధ్య‌నే కిర్లంపూడిలో ముద్రగడ ఇంటికి వెళ్లిన మోహన్ బాబు ఉద్య‌మ‌నేత‌ను ఆకాశానికెత్తేశారు. ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభం పోరాట యోధుడు అంటూ పొగిడేయ‌డం.. ఆయ‌న పోరాటంలో న్యాయం ఉంద‌ని అన‌డం కాపుల్లో విస్త్ర‌తంగా చ‌ర్చ‌కొచ్చింది. కాపు రిజ‌ర్వేష‌న్ల‌కు మోహ‌న్‌బాబు స‌పోర్టుపై అంద‌రూ విస్మ‌యానికి గుర‌య్యారు. సామాజిక వ‌ర్గాల వారీగా చూస్తే చంద్ర‌బాబుకు మోహ‌న్‌బాబు అత్యంత స‌న్నిహితుడు. అలాగే దివంగ‌త‌ వైయ‌స్సార్ ఫ్యామిలీ మెంబ‌ర్‌తో వియ్యమొందారు కాబ‌ట్టి ఆయ‌న జ‌గ‌న్‌కి కూడా అంతే స‌న్నిహితుడు. సామాజిక వ‌ర్గాల లెక్క ప్ర‌కారం క‌మ్మ‌, రెడ్డి ఇరు వ‌ర్గాల‌కు అత‌డు స‌న్నిహితుడే. ఇప్పుడు అందుకు విరుద్ధంగా కాపు సామాజిక వ‌ర్గానికి చెందిన ముద్ర‌గ‌డ‌ను పొగిడేయ‌డ‌మేంటో అర్థం గాక జ‌నం బుర్ర‌లు పీక్కుంటున్నారు. అయితే గురువుగారూ అని పిలుచుకునే డా.దాస‌రి నారాయ‌ణ‌రావు కాపు సామాజిక వ‌ర్గం కాబ‌ట్టి అలా వెళ్లి కలిసొచ్చారా? ఏమో!! ఏదైతేనేం ప్ర‌స్తుతం రాజ‌కీయ‌వ‌ర్గాల్లో ఓ మాట బ‌లంగా వినిపిస్తోంది. జ‌గ‌న్- ముద్ర‌గ‌డ లింకు గురించి ప్ర‌పంచానికి తెలుసు కాబ‌ట్టి.. ఆ కోణంలోనే కిర్లంపూడి వెళ్లి ముద్ర‌గ‌డ‌కు మద్ద‌తు ప‌లికారా? అన్న కూపీ లాగుతున్నారు కొంద‌రు. ఆయ‌న రూటే స‌ప‌రేటు. ఆయ‌న మైండ్ గేమే వెరీ ఇంట్రెస్టింగ్! కుర్రో కుర్రు!! అని ముచ్చ‌టించుకుంటున్నారు జ‌నం!!