క్యుట్ జూనియర్ నాని 2.0… జున్నుగాడు

Thursday, March 29th, 2018, 11:43:09 AM IST

తెలుగు ప్రేక్షకుల అభిమాన నటుడు, నేచురల్ స్టార్ నాని గ‌త‌ ఏడాది మార్చి 29న‌ తండ్రి ప్రమోషన్ అందుకున్న సంగతి తెలిసిందే. ఏప్రిల్ 2న తొలిసారి త‌న త‌న‌యుడిని ప్ర‌పంచానికి ప‌రిచ‌యం చేసిన నాని ఆ త‌ర్వాత కొద్ది సార్లు మాత్ర‌మే త‌న‌యుడితో క‌లిసి దిగిన ఫోటోల‌ని సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశాడు. బాల‌ల దినోత్స‌వం సంద‌ర్భంగా త‌న త‌న‌యుడితో దిగిన ఓ అంద‌మైన ఫోటోని త‌న ట్విట్ట‌ర్‌లో షేర్ చేస్తూ పిల్ల‌లంద‌రికి హ్య‌పీ చిల్డ్ర‌న్స్ డే విషెస్ తెలిపాడు ఆక్టర్ నాని. ఇక తాజాగా త‌న త‌న‌యుడికి ఫ‌స్ట్ బ‌ర్త్‌డే విషెస్ తెలియ‌జేస్తూ తాజాగా దిగిన క్యూట్ పిక్‌ షేర్ చేశాడు. ఇందులో నాని త‌న‌ త‌న‌యుడిని ముద్దాడుతున్నాడు. నాని త‌న‌యుడిని అభిమానులు జూనియ‌ర్ నేచుర‌ల్ స్టార్ అంటుంటే మ‌రి కొంద‌రు నాని 2.0 అంటున్నారు. నాని 2012 అక్టోబర్ 27న అంజనాతో ఏడడుగులు వేసిన సంగతి తెలిసిందే. వీరి వివాహం వైజాగ్ లో గ్రాండ్ గా జరిగింది. నాని ప్ర‌స్తుతం కృష్ణార్జున యుద్ధం సినిమా చేస్తున్నాడు. మేర్ల‌పాక గాంధీ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నాడు. అయితే ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈ రోజు తిరుపతిలో జరగనున్నది. ఈ మూవీ త‌ర్వాత హను రాఘ‌వ‌పూడితో నాని ఓ క్రేజీ ప్రాజెక్ట్ చేయ‌నున్న‌ట్టు స‌మాచారం.