ఎన్టీఆర్, త్రివిక్రమ్ సినిమాలో మరో అందాల రాక్షసి స్టార్…

Wednesday, April 18th, 2018, 04:45:07 PM IST

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మాటల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్‌ కాంబినేషన్ లో మూవీ రూపొందుతున్న‌సంగ‌తి తెలిసిందే. ఏప్రిల్ 13న సెట్స్ పైకి వెళ్లిన ఈ చిత్రం ప్ర‌స్తుతం రామోజీ ఫిలిం సిటీలో షూటింగ్ జ‌రుపుకుంటుంది. ఈ చిత్రం కోసం త్రివిక్ర‌మ్ అదిరిపోయే స్క్రిప్ట్ సిద్ధం చేశారు. తార‌క్ డిఫ‌రెంట్ లుక్‌లో క‌నిపించ‌నున్నారు. ఎన్టీఆర్ లుక్ చూసి ఫ్యాన్స్ షాక‌వ్వ‌డం ఖాయ‌మ‌ని అంటున్నారు. ఏప్రిల్ 25 వర‌కు హైదరాబాద్ లోనే తొలి షెడ్యూల్ చిత్రీకరించనున్నారని స‌మాచారం. ఈ షెడ్యూల్ లో యాక్షన్ ఎపిసోడ్ ని చిత్రీకరించనున్నారని టాక్‌. ఇంతక ముందు సినిమాలకంటే భిన్నంగా ఈ సినిమాలో రామ్ లక్ష్మణ్ లు యాక్షన్ ఎపిసోడ్ డిజైన్ చేశారని టాక్. థమన్ చిత్రానికి సంగీతం అందించనున్నాడు. పూజా హెగ్డే కథానాయికగా నటించనుంది. అందాల రాక్ష‌సి చిత్రంతో టాలీవుడ్‌కి ఎంట్రీ ఇచ్చిన న‌వీన్ చంద్ర మూవీలో ముఖ్య పాత్ర పోషించ‌నున్నాడ‌ని తెలుస్తుంది. భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా రూపొందనున్న ఈ చిత్రం హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బేనర్‌పై రూపొందుతుంది. ఈ చిత్రం కోసం ఎన్టీఆర్‌ ప్ర‌ముఖ హాలీవుడ్ ఫిట్‌నెస్ ట్రైన‌ర్ లాయిడ్ స్టీవెన్స్ ఆధ్వ‌ర్యంలో భారీ వ‌ర్క‌వుట్స్ చేసి న్యూ లుక్‌లోకి మారిన సంగ‌తి తెలిసిందే. రాయలసీమ బ్యాక్ డ్రాప్‌ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నాగబాబు ఓ కీలక పాత్రలో నటిస్తున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. మూడెకరాల స్థలంలో త్రివిక్రమ్ భారీ సెట్ వేయించాడని కూడా చెబుతున్నారు.

  •  
  •  
  •  
  •  

Comments