బ్లాక్ బస్టర్ వకీల్ సాబ్ అంటున్న నితిన్

Friday, April 9th, 2021, 02:27:36 PM IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. అయితే థియేటర్ల లోకి అడుగు పెట్టిన వకీల్ సాబ్ అన్ని చోట్ల కూడా పాజిటివ్ టాక్ వచ్చేసింది. అయితే ఈ చిత్రం పై ప్రముఖ హీరో, నటుడు నితిన్ స్పందించారు. బ్లాక్ బస్టర్ వకీల్ సాబ్ అంటూ చెప్పుకొచ్చారు. పవర్ స్టార్ ఆన్ ఫైర్ అంటూ పవన్ పై తన అభిమానాన్ని మరొకసారి వ్యక్త పరిచారు. సినిమా హిట్ టాక్ సొంతం చేసుకోవడం పట్ల చిత్ర యూనిట్ కి అభినందనలు తెలిపారు నితిన్. అయితే ఈ సినిమా పై ప్రముఖులు, దర్శకులు, నిర్మాతలు స్పందిస్తున్నారు. పవన్ కళ్యాణ్ ను మళ్ళీ వెండి తెర పై చూడటం పట్ల సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాక పవన్ కళ్యాణ్ రాజకయాల్లోకి వెళ్లిన తర్వాత చేసిన సినిమా కావడం తో సర్వత్రా వకీల్ సాబ్ చిత్రం పై చర్చ జరుగుతుంది.