బాలీవుడ్ సీనియర్ హీరో మృతి

Monday, December 4th, 2017, 12:07:36 PM IST

బాలీవుడ్ సిల్వర్ స్క్రీన్ పై తనకంటూ ఒక మంచి గుర్తింపు తెచ్చుకున్న సీనియర్ నటుడు శశికపూర్ ఈ రోజు కన్ను మూశారు. 79 సంవత్సరాల వయసుగల శశికపూర్ హఠాన్మరణం బాలీవుడ్ ప్రముఖులను షాక్ కి గురి చేసింది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని వారు కోరుకున్నారు. తనదైన శైలిలో చిరస్థాయిగా గుర్తిండిపోయే పాత్రలను ఎన్నో చేసిన అయన నిర్మత గాను దర్శకుడిగాను మంచి గుర్తింపును అందుకున్నారు. 1948లో నుంచే ఆయన బాలనటుడిగా సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. ఆ తర్వాత ఎన్నో సినిమాలో నటించారు. 1994లో నేష‌న్ ఫిల్మ్ అవార్డు అందుకున్న అయన 1999లో సినిమాలకు వీడ్కోలు పలికారు. ఇక 2011లో ప‌ద్మ భూష‌ణ్ – 2015లో దాదాసాహెబ్ పాల్కే పుర‌స్కారాలు ల‌భించాయి.

  •  
  •  
  •  
  •  

Comments