సునీల్ హీరో నుండి మళ్ళీ ఇలా మారాడా..?

Saturday, May 19th, 2018, 11:04:03 AM IST

సునీల్.. నువ్వే నువ్వే చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు ఒక కమీడియన్ గా పరిచయమై ఆ తర్వాత ఎన్నో చిత్రాలలో ప్రామినెంట్ కమీడియన్ రోల్స్ చేస్తూ తెలుగు చిత్రసీమలో సినీ అభిమానులకు సుపరిచితుడయ్యాడు. అలా నెమ్మదిగా తన నటన అనుభవాన్ని పెంచుకుంటూ హీరో గా మారిన సునీల్ కొన్ని చిత్రాల వరకే హిట్టు కొట్టి తర్వాత చాలా డిసాస్టర్లతో ఏం చేయాలో అర్థం కాక కొద్దిరోజులు కనుమరుగైపోయారు. హీరో లుక్స్ తో కనిపించాలని ఏంటో కష్టపడి తన బాడీ ట్రాన్స్ ఫార్మేషన్ చేసుకొని తన అభిమానులను అలరించాలని ఎంత కష్టపడినా చివరికి హిట్టు దక్కలేదు.

ఇక చేసేది ఏమీ లేక ఈ మధ్యనే సునీల్ మళ్ళీ పాత బాటలో సాగానున్నాడు. మళ్ళీ కమీడియన్ గా రాణించడానికి పలు ప్రాజెక్టుల పైన సంతకం కూడా చేసాడు. మెగాస్టార్ చిరంజీవి 151వ చిత్రమైన సైరా చిత్రంలో కూడా ప్రధాన కమీడియన్ పాత్రలో అభిమానులకు పాత సునీల్ ప్రతిబింబించేలా అలరించనున్నాడు. అంతేకాకుండా హను రాఘవపుడి దర్శకత్వంలో శర్వానంద్ సాయిపల్లవి జంటగా రానున్న పడిపడి లేచే మనసు చిత్రంలో కూడా కమీడియన్ గా నటించడానికి సునీల్ సై అంటూ సంతకం చేసాడట. ఇక సునీల్ కి మళ్ళీ పాత రోజులు వచ్చేసినట్టే మరి. సునీల్ కమీడియన్ గా సినిమాల్లోకి తిరిగి రంగప్రవేశం చేస్తే ఇప్పుడు ఫాంలో ఉన్న కొత్త కమీడియన్ల పరిస్థితి ఏంటో మరి.

  •  
  •  
  •  
  •  

Comments