నైటీలు ధరించే మహళలపై కామెంట్ చేసిన .. నటుడు ?

Friday, November 25th, 2016, 12:44:14 PM IST

uttej
టాలీవుడ్ లో నటుడు, రచయితగా తనదైన టాలెంట్ తో గుర్తింపు తెచ్చుకున్న నటుడు ఉత్తేజ్ .. అడపా దడపా సినిమాల్లో నటిస్తున్నాడు. ప్రస్తుతం ఆయనకు పెద్దగా అవకాశాలు రావడం లేదు, ఇక అయన కూతురు హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది .. ఈ విషయం పక్కన పెడితే .. లేటెస్ట్ గా ఉత్తేజ్ ఓ టివి ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూ లో కుటుంబ వ్యవస్థ, సమాజం పై పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసాడు, ముఖ్యంగా ఆడవారి వస్త్రధారణ పై కూడా అయన చేసిన కామెంట్స్ ఇప్పుడు సంచలనం రేపుతున్నాయి. ముక్యంగా నైటీ లు ధరించే మహిళల గురించే కామెంట్స్ చేసాడు .. కొందమంది రాత్రిపూట నైటీలు ధరించే మార్కెట్ కు వస్తారని, అదే నైటీ తో బైక్ లు కూడా నడుపుతున్నారని .. అలాగేనా బయటకు వచ్చేది అని ప్రశ్నించారు. వీళ్ళు ఎప్పుడు ఫోన్ లోనే మాట్లాడుతుంటారని, కానీ వారి పిల్లలు మాత్రం ఫోన్ పట్టకూడని అంటారు ఇదెక్కడి న్యాయం అన్నారు. ప్రస్తుతం పిల్లలకు సోషల్ ఎడ్యుకేషన్ అందడం లేదని అంటున్నాడు. మొత్తానికి ఉత్తేజ్ కామెంట్స్ .. మహిళలకు కోపం తెప్పించేవిదంగా ఉందని అంటున్నారు జనాలు.