ఆ క్రేజీ కమెడియన్ ని బ్యాన్ చేశారట ?

Saturday, September 15th, 2018, 10:54:55 PM IST


తెలుగులో ఉన్నంతమంది కమెడియన్స్ ఏ బాషా పరిశ్రమలో లేరన్న విషయం తెలిసిందే. అయితే తెలుగు తరువాత తమిళంలో కూడా పలువురు కమెడియన్స్ సత్తా చాటుతున్నారు. తెలుగులో బ్రహ్మానందం కు ఎంత ఫాలోయింగ్ ఉందొ … అదే రేంజ్ లో క్రేజ్ తెచ్చుకున్నాడు తమిళ కమెడియన్ వడివేలు. తాజాగా వడివేలు పై కోలీవుడ్ లో నిషేధం విదించారట !! ప్రేమికుడు సినిమాతో కమెడియన్ గా స్టార్ ఇమేజ్ అందుకున్న వడివేలు ఆ తరువాత హీరోగా కూడా చేశారు. అయితే ఈ మద్యే అయన రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి .. మళ్ళి సినిమాల్లోకి వచ్చేసారు. ప్రస్తుతామ్ ఆయనకు మంచి అవకాశాలు వస్తున్నాయి .. అయితే తన బ్యాడ్ విధానాల వల్ల అయన నానా రచ్చ చేస్తున్నాడట. షూటింగ్ కు టైం కు రాకపోవడం, తాగి రావడం, దర్శకుడు చెప్పినట్టు వినకపోవడం లాంటి రచ్చ చేస్తున్నారట, దాంతో పలువురు దర్శక నిర్మాతలు ఫిలిం ఛాంబర్ లో కేసు పెట్టారు. లేటెస్ట్ గా హింసే సరసన్ 23 వ పులకేశి సినిమాకు సీక్వెల్ ప్లాన్ చేసాడు దర్శకుడు చింబు దేవన్. ఈ సినిమాను ప్రముఖ దర్శకుడు శంకర్ నిర్మిస్తున్నాడు. అయితే ఈ సినిమా షూటింగ్ లో వడివేలు నానా రచ్చ చేస్తున్నాడట. కాల్షీట్స్ మొత్తం వృధా చేస్తున్నాడట. షూటింగ్ కు టైం కు రాకపోవడంతో అడిగితె అసలు షూటింగ్ కు రానని మొండికేశాడట. దాంతో దర్శకుడు, నిర్మాత ఛాంబర్ కు పిర్యాదు చేసారు .. ఈ సినిమా వల్ల 9 కోట్ల నష్టం వాటిల్లిందని దాన్ని ఇప్పించాలని శంకర్ కోరాడట. దాంతో వడివేలు పై ఫిలిం ఛాంబర్ వాళ్ళు నిషేధం విధించారట. ఎవరు కూడా ఆయనతో సినిమా చేయొద్దని ఆదేశించారట.

  •  
  •  
  •  
  •  

Comments