హాట్ టాపిక్: విజయ్ కి సలహా ఇస్తున్న ముఖ్యమంత్రి జగన్, పీకే వైరల్ పోస్టర్!

Wednesday, February 12th, 2020, 12:40:30 PM IST

గత కొన్ని రోజులుగా తమిళనాడులో రాజకీయ పరిస్థితులు మారుతున్నాయి. అకస్మాత్తుగా హీరో విజయ్ పేరు ఇపుడు తమిళనాట మారుమ్రోగిపోతుంది. ఇటీవల విజయ్ ఇంటి ఫై జరిగిన ఐటీ దాడుల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ప్రమేయం ఉన్నట్లుగా వార్తలు వచ్చాయి. అయితే షూటింగ్ సమయంలో కూడా విజయ్ ఫై అధికారులు దాదాపు అయిదు గంటల సమయం విచారణ జరిపారు. అయితే ఒకపక్క కమల్ హాసన్,రజిని కాంత్ రాజకీయాలలో కీలకం అయ్యేందుకు పావులు కదుపుతున్న సమయం లో తమిళ నాట ఒక పోస్టర్ సంచలనంగా మారింది.

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మరియు రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఫోటోల మధ్య తమిళ నటుడు విజయ్ ఫోటో ని మార్ఫింగ్ చేసి జనారణ్య ప్రదేశంలో అతికించారు. అయితే ఆ పోస్టర్ ఇపుడు వైరల్ గా మారుతుంది. తమిళనాట ప్రస్తుతం ఇది హాట్ టాపిక్ అయింది. అభిమానులు విజయ్ పొలిటికల్ ఎంట్రీ కోసం ఒత్తిడి చేస్తున్నట్లు తెలుస్తుంది. ఆంధ్ర ప్రదేశ్ ని మేము కాపాడుతున్నాం, ఇబ్బందుల్లో ఉన్న తమిళనాడు ని మీరే కాపాడాలి అన్నట్లు గా ఆ పోస్టర్ లో ఉండటం గమనార్హం.