సెట్స్ లో కల్యాణి బ‌ర్త్ డే సంబరాలు

Friday, April 6th, 2018, 09:32:46 AM IST

ఇటివల అక్కినేని అఖిల్ రెండో చిత్రం హ‌లో విక్ర‌మ్ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రంలో క‌థానాయిక‌గా న‌టించింది ద‌ర్శ‌కుడు ప్రియ‌ద‌ర్శ‌న్ కూతురు క‌ళ్యాణి ప్రియ‌ద‌ర్శ‌న్‌. హ‌లో మూవీ క‌ళ్యాణికి తొలి మూవీ అయిన‌ప్ప‌టికి ఎంతో మెచ్యూర్‌గా న‌టించింది. తనకు నటనలో ఎన్నో ఏళ్ల అనుభవం ఉన్నట్టు తన నటనా శైలితో అభిమానులను అలరించింది. ప్ర‌స్తుతం సుధీర్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో శ‌ర్వానంద్ హీరోగా తెర‌కెక్కుతున్న చిత్రంలో క‌థానాయిక‌గా న‌టిస్తుంది. వైజాగ్‌లో ఈ మూవీ తొలి షెడ్యూల్ జ‌రుపుకుంటుంది. ఈ షెడ్యూల్‌లో హీరో హీరోయిన్స్ మ‌ధ్య కొన్ని కీల‌క స‌న్నివేశాలు చిత్రీక‌రించ‌నున్న‌ట్టు తెలుస్తుంది. అయితే నిన్న క‌ళ్యాణి బ‌ర్త్ డే కావ‌డంతో మేక‌ర్స్ సెట్స్‌లోనే క‌ళ్యాణి బ‌ర్త్ డే వేడుక‌లు జరిపారు. శ‌ర్వానంద్‌, సుధీర్ వ‌ర్మ త‌దిత‌రులు క‌ళ్యాణికి కేక్ తినిపించి బ‌ర్త్ డే విషెస్ అందించారు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై రూపొందుతోన్న ఈ సినిమా శర్వానంద్ కెరియర్‌లో బెస్ట్ మూవీగా నిలుస్తుంద‌ని టీం భావిస్తుంది. క‌ళ్యాణికి కూడా మంచి పేరు తీసుకొస్తుంద‌ని అంటున్నారు. ఈ ఏడాది చివ‌రిలో మూవీ రిలీజ్ చేసేలా చిత్ర బృందం ప్లాన్ చేస్తుంది.