ఇక్కడ కామ పిశాచాలకు కొదవే లేదంటున్న హీరోయిన్ ?

Thursday, May 3rd, 2018, 10:54:41 AM IST

సినిమా రంగంలో కాస్టింగ్ కౌచ్ వ్యవహారం పై ఈ మధ్య ఒకరి తరువాత ఒకరుగా పలువు హీరోయిన్స్ స్పందిస్తూనే ఉన్నారు. ప్రస్తుతం టాలీవుడ్ లో సంచలనం రేపిన ఈ వ్యవహారం ఇప్పుడు బాలీవుడ్ లోకూడా వైరల్ అయింది. పలువురు హీరోయిన్స్ కాస్టింగ్ కౌచ్ బారిన పడిన సంగతి చెప్పఁడంతో పెద్ద రచ్చే జరుగుతుంది. ఇక తాజాగా బాలీవుడ్ హీరోయిన్ మహిగిల్ కూడా ఈ విషయం స్పందిస్తూ కెరీర్ ప్రారంభంలో సినిమాలో అవకాశం కోసం ఓ దర్శకుడి దగ్గరికి వెళ్ళినప్పుడు సల్వార్ కమీజ్ ధరించి నిండుగా వస్తే నీకు ఎవరు అవకాశాలు ఇస్తారని హేళనగా మాట్లాడారని చెప్పింది. అవకాశాల కోసం లైంగిక వేధింపులు తప్పలేదని .. కానీ అలాంటి రొంపిలోకి దిగకుండా జాగ్రత్తగా ఉన్నానని, సమాజంలో కామ పిశాచులకు కొదవే లేదని మండి పడ్డారు. దేవ్ డి సినిమాతో ఉత్తమ నటిగా ఫిలిం ఫేర్ అవార్డు అందుకున్న ఈమె ప్రస్తుతం పెద్దగా సినిమాలు చేయడం లేదు.