నేను రెడీ విత్ డబుల్ ఎనర్జీ : రకుల్

Sunday, April 22nd, 2018, 09:10:31 AM IST

తెలుగులో వరుసగా స్టార్ హీరోల చిత్రాల్లో నటిస్తూ క్రేజీ కథానాయికగా పేరుతెచ్చుకుంది రకుల్‌ప్రీత్ సింగ్. ప్రస్తుతం తెలుగులో చెప్పుకోదగ్గ ఆఫర్‌లు లేకపోవడంతో తమిళ చిత్రాలపై దృష్టిపెట్టిన ఆమె రెట్టించిన ఉత్సాహంతో సూర్య హీరోగా నటిస్తున్న ఎన్‌జీకె (నందగోపాల్‌కుమరన్) షూటింగ్‌లో పాల్గొంటున్నది. సెల్వరాఘవన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఎస్.ఆర్.ప్రకాష్‌బాబు, ఎస్.ఆర్. ప్రభు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. రకుల్‌ప్రీత్‌సింగ్ ప్రధాన నాయిక. రెండవ కథానాయికగా సాయిపల్లవి నటిస్తున్నది. జనవరి 22న ఈ చిత్రాన్ని లాంఛనంగా ప్రారంభించారు. అయితే తమిళ చలన చిత్ర నిర్మాతల మండలి నిరసనల కారణంగా గత కొన్ని రోజులుగా తమిళ చిత్రాల షూటింగ్‌లు నిలిపివేశారు. ఇటీవల నిర్మాతల మండలి చర్చలు ఫలించడంతో మళ్లీ షూటింగ్‌ల హంగామా మొదలైంది. దీంతో గత కొన్ని రోజులుగా ఆగిపోయిన సూర్య చిత్రం తాజా షెడ్యూల్ శనివారం నుంచి మొదలైంది. ఈ విషయాన్ని సోషల్ మీడియా ట్విట్టర్ ద్వారా అభిమానులతో పంచుకుంది రకుల్. తొలి రోజు రెట్టించిన ఉత్సాహంతో ఎన్‌జీకె చిత్రీకరణలో పాల్గొన్నాను. చాలా ఆనందంగా వుంది అని తెలిపింది. ఈ ఏడాది నవంబర్‌లో చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

  •  
  •  
  •  
  •  

Comments