రవితేజ సినిమాలో అవకాశం అంటూ నటిపై లైంగిక వేధింపులు ?

Tuesday, March 6th, 2018, 10:40:37 AM IST

మాస్ రాజా రవితేజ సినిమాలో హీరోయిన్ గా అవకాశం ఇప్పిస్తానని చెప్పి ఓ వర్ధమాన నటిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు ఓ అసిస్టెంట్ దర్శకుడు ? ఈ విషయం సదరు నటి పోలీసులకు పిర్యాదు చేయడంతో ఆ అసిస్టెంట్ దర్శకుడు జగదీశ్ ని పోలీసులు అరెస్ట్ చేసారు. ఈ కేస్ వివరాలని పరిశీలిస్తే .. గచ్చిబౌలి లో నివాసం ఉంటె ఓ వర్ధమాన నటికి పేస్ బుక్ ద్వారా జగదీష్ అనే వ్యక్తి పరిచయం అయ్యాడు. తాను అసిస్టెంట్ దర్శకుడిని అని పరిచయం చేసుకున్న జగదీశ్ అనే వ్యక్తి ప్రస్తుతం రవితేజ హీరోగా నటిస్తున్న సినిమాలో ఓ పాత్ర ఇప్పిస్తానని చెప్పి నమ్మించాడు. ఈ సినిమాలో పాత్ర గురించి చెప్పాలి అంటూ ప్రగతి నగర్ లో ఉన్న ఓ అపార్ట్మెంట్ లోని ఫలానా ప్లాట్ కు రమ్మని చెప్పాడట. దాంతో ఆమె అక్కడికి రావడంతో జగదీష్ ఆమెపై అత్యాచార యత్నం చేసాడట. దాంతో ఆమె ప్రతిఘటించడంతో రెచ్చిపోయిన జగదీష్ ఆమెపై దాడికి దిగాడు, బెల్టుతో ముఖం, వీపు పై కొట్టాడని, ఆ తరువాత ఆమెను అపార్ట్మెంట్ నుండి గెంటేసాడట, వెంటనే బాధితురాలు బంజారాహిల్స్ పోలీసులకు పిర్యాదు చేయడంతో జగదీష్ ని అరెస్ట్ చేసారు.