షాకింగ్ న్యూస్ : ఆ డైరెక్టర్ ఎక్కడ పడితే అక్కడ ముట్టుకున్నాడు : నటి డార్క్ సీక్రెట్స్

Friday, April 27th, 2018, 05:12:07 PM IST

భాష‌, ప్రాంతాలతో ఎలాంటి సంబంధం లేకుండా ప్ర‌తీ చిత్ర‌ప‌రిశ్ర‌మ‌లోనూ మ‌హిళ‌లపై లైంగిక వేధింపులు జరుగుతన్నాయి. కొద్ది రోజుల నుండి టాలీవుడ్‌లో కాస్టింగ్‌కౌచ్‌పై తీవ్ర స్థాయిలో పెద్ద పోరాటం జ‌రిగిన సంగ‌తి కొత్తగా చెప్పనక్కర్లేదు. అయితే తాజాగా ప్రముఖ బీబీసీ నిర్వ‌హించిన ఇంట‌ర్వ్యూలో కాస్టింగ్ కౌచ్ వ్య‌వ‌హారాల‌పై న‌టీమ‌ణులు ఉషా జాద‌వ్‌, రాధికా ఆప్టేలు ఇంటర్వ్యులు ఇచ్చారు. ఇండ‌స్ట్రీకి వ‌చ్చిన కొత్త‌లో తాను చాలా లైంగిక వేధింపుల‌ను ఎదుర్కొన్నాన‌ని గ‌తంలో జాతీయ ఉత్త‌మ న‌టిగా నిలిచిన ఉషా జాద‌వ్ వెల్లడించింది.

`తాను బాలీవుడ్ చలన చిత్ర ప‌రిశ్ర‌మ‌కు వ‌చ్చిన కొత్త‌లో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నానని చెప్పింది. సినిమాల్లో అవ‌కాశాలు కావాలంటే నిర్మాత‌లు, ద‌ర్శ‌కుల ద‌గ్గ‌ర‌కు కచ్చితంగా వెళ్లాల్సిందేన‌ని ఓ వ్య‌క్తి చెప్పాడు. ఓ ద‌ర్శ‌కుడు నాతో చాలా అస‌భ్యంగా ప్ర‌వ‌ర్తించాడు. నా శ‌రీరంపై ఎక్క‌డ‌ప‌డితే అక్క‌డ చేతులేశాడు. ముద్దుపెట్టుకున్నాడు, ఎప్పుడు పడితే అప్పుడు ప్రైవేటు ప్లేసులోకి రమ్మని పిలిచేవాడు. అత‌డి ప్ర‌వ‌ర్త‌న‌కు షాకైపోయాన‌`ని ఉషా వెల్ల‌డించింది. ఇక‌, రాధిక మాట్లాడుతూ సినిమా ఇండ‌స్ట్రీలో కొంత‌మంది ప‌వ‌ర్‌ఫుల్ వ్య‌క్తులు ఉంటార‌ని, ఏం చేసినా అడిగే వారెవ‌రూ ఉండ‌ర‌ని వారు భావిస్తుంటార‌ని తెలిపింది. మ‌హిళ‌ల‌తోపాటు పురుషులు కూడా క‌లిసి పోరాడితేనే కాస్టింగ్ కౌచ్‌కు ప‌రిష్కారం దొరుకుతుంద‌ని రాధిక అభిప్రాయ‌ప‌డింది. లేకపొతే మాలాగా ఇంకా ఇండస్ట్రీలో చాలా మంది బాలి అయిపోవాల్సిందేనని తమ ఆవేదన వ్యక్తపరిచారు

  •  
  •  
  •  
  •  

Comments