షాకింగ్ సీక్రెట్స్ : టాలీవుడ్ నుండి బాలీవుడ్ కి పాకిన కాస్టింగ్ కౌచ్ విదాదం

Thursday, April 26th, 2018, 11:00:25 PM IST

కాస్టింగ్ కౌచ్ ఈ మాట వినగానే సినీ పరిశ్రమలో ప్రతీ విభాగంలో పని చేసే వ్యక్తుల గుండెల్లో ఒక్కసారిగా రైళ్ళు పరిగెత్తుతున్నాయి. అయితే ఈ మధ్య కాలంలో టాలీవుడ్‌ను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నసీరియస్ విషయమైన ఈ క్యాస్టింగ్‌ కౌచ్‌ వ్యవహారాన్ని సమర్థిస్తూ వ్యాఖ్యలు చేయడం ద్వారా సీనియర్‌ కొరియోగ్రాఫర్‌ సరోజ్‌ ఖాన్ బాలీవుడ్‌లో కొత్త వివాదానికి క్లాప్ బోర్డు కొట్టారు. బాలీవుడ్ సినీ ఇండస్ట్రీ ఆడపడుచును రేప్‌ చేసి, నడి రోడ్డున పడేయకుండా, అందుకు బదులుగా ఆమెకు జీవనోపాధిని కల్పిస్తున్నారని ఆమె వెల్లడించారు. సరోజ్‌ ఖాన్‌ చేసిన వ్యాఖ్యలపై బాలీవుడ్ లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. పలువురు సినీ ప్రముఖులు ఆమె వ్యాఖ్యలను తప్పుపడుతూ చర్చలు సాగిస్తున్నారు. సోషల్‌ మీడియాలో నెటిజన్లు ఈ తేరా వెనుక బాగోతాలను వ్యతిరేకిస్తూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో బాలీవుడ్‌లో నెలకొన్న క్యాస్టింగ్‌ కౌచ్‌ వ్యవహారంపై బీబీసీ ఒక సంచలన డాంక్యుమెంటరీని ప్రసారం చేయడానికి సిద్దపడింది. రాధికా ఆప్తే, ఉషా జాధవ్‌ వంటి ప్రముఖ సినీ తారలతో సహా పలువురు వర్థమాన నటీనటులు తమ అనుభవాలను ఈ డాక్యుమెంటరీలో ప్రస్తావించారు.

‘బాలీవుడ్‌ డార్క్‌ సీక్రెట్‌’ అనే పేరుతో ఈ డాక్యుమెంటరీని బీబీసీ ప్రసారం చేయబోతుంది.‘హాలీవుడ్‌ తరహాలో బాలీవుడ్‌లో మీటూ ఉద్యమం జరిగిన దాఖలాలు ఎక్కడా లేవు. కానీ హిందీ చిత్ర పరిశ్రమ కూడా లైంగిక వేధింపులు, దూషణలకు అతీతం కాదని పలువురు నటీనటుల అనుభవాన్ని రజనీ వైద్యనాథన్‌ మన ముందుకు తీసుకు వస్తున్నారు’అంటూ దీనిని ప్రసారం చేయబోతుంది. ఈ డాంక్యుమెంటరీలో బాలీవుడ్ నటి రాధికా ఆప్తే ప్రసంగిస్తూ.. ‘కొందరు తమను తాము దేవుళ్లుగా భావిస్తారు. వాళ్లు శక్తివంతుల. మేం మాట్లాడినా ఎవరూ పట్టించుకోరులే అనే భావనలో విర్రవీగిపోతూ ఉంటారు. ఒకవేళ ఎవరైనా మాట్లాడితే వారి కెరీర్‌ నాశనమైనట్టేనని భావిస్తారు అలా చేయడానికి కూడా వెనుకడుగు వేయరు. మహిళలు, పురుషులు కలిసికట్టుగా ముందుకొచ్చి ఇది జరగకూడదని నిర్ణయిస్తే ఇది ఆగిపోతోంది. అలాంటిది ఇక్కడ రావాలని కోరుకుంటున్నా’ అని పేర్కొన్నారు. సినిమాల్లో అవకాశం దొరకాలంటే నిర్మాతతో, దర్శకుడితో పడుకోవాలని తనకు చెప్పారని నటి ఉషా జాధవ్‌ తన అనుభవాలను బీబీసీ విలేకర్లకు వివరించారు.

ఈ డాక్యుమెంటరీకి సంబందించిన అంశంలో ఓ సీనియర్ నటి షాకింగ్‌ సీక్రెట్స్ బయట పెట్టారు. తనను ఒక వ్యక్తి నిత్యం లైంగికంగా వేధించాడని ఆమె తన ఆవేదన తెలిపారు.‘ఇండస్ట్రీలో పని దొరకాలంటే.. ఎప్పుడు వీలైతే అప్పుడు శృంగారంలో పాల్గొనడం ఆనందంగా భావించు. నీ సెక్సువాలిటీని ఒప్పుకో’ అని అతను కరాకండిగా మాట్లాడుతూ సూచించారు.‘అతను కోరుకునే ప్రతీ సారి నన్ను బలవంత పెట్టేవాడు. ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు దగ్గరకు వచ్చి అసభ్యంగా ప్రవర్తిస్తూ నన్ను ముద్దు పెట్టుకునేవాడు. అతని ప్రవర్తన ఒక్కోసారి నన్ను షాక్‌కు గురిచేసింది’అని ఆమె వెల్లడించారు. గతంలోనూ పలువురు బాలీవుడ్‌ నటీమణులు క్యాస్టింగ్‌ కౌచ్‌ గురించి మాట్లాడారు. రిచా చద్దా, స్వర భాస్కర్‌ వంటి వారు సినీ పరిశ్రమలో క్యాస్టింగ్‌ కౌచ్‌ ఉందని ప్రస్తావించారు. అయితే, తమను లైంగికంగా వేధించిన వారి పేర్లను వారు వెల్లడించలేదు. ఇకనైనా ఇండస్ట్రీలో ఇలాంటి పనులు చేయడం మానుకుంటే మంచిదని, న్యాయం జరుగుతుందంటే తాము కూడా ఎంతవరకు అయినా పోవడానికి సిద్దమని వెల్లడించారు.

  •  
  •  
  •  
  •  

Comments