కాస్టింగ్ కౌచ్ గురించి నోరు విప్పిన స్టార్ హీరోయిన్

Sunday, April 22nd, 2018, 06:31:37 PM IST

కాస్టింగ్ కౌచ్ టాలీవుడ్ లో ఇప్పుడిదే హాట్ టాపిక్. సినీ ఇండస్ట్రీలో మహిళలను లొంగదీసుకుని లైంగికంగా దోచుకుంటున్నారంటూ పలువురు చేస్తున్న ఆందోళనలపైనే ఎక్కడ చూసినా చర్చ జరుగుతుండటం మనం చూస్తూనే ఉన్నాం.

ఎవరన్నా సినిమా హీరోయిన్స్ ఇంటర్వ్యూ ఇచ్చారంటే అందులో ఈ కాస్టింగ్ కౌచ్ అనే అంశంపై ఖచ్చితంగా ఎలాగోలా స్పందించాల్సిన పరిస్థితి ప్రస్తుతం నెలకొంది. ఈ పరిణామాల్లో కాస్టింగ్ కౌచ్‌పై జరుగుతున్న పోరాటాలు రోజుకో మలుపు తిరుగుతూ రకరకాల చర్చలకు దారితీస్తున్నాయి.

అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఈ విషయమై తన అభిప్రాయం వెళ్లబుచ్చింది హీరోయిన్ ఆదాశర్మ. సెక్సువల్ ఫేవర్ చేయడం, చేయక పోవడం అనేది పూర్తిగా వ్యక్తిగతమైన అంశమని తెలిపింది. ప్రస్తుత పరిస్థితుల్లో పని కోసం ‘సెక్సువల్ ఫేవర్’ చేసేందుకు కొంతమంది వెనుకాడటం లేదని చెబుతూ.. ఇలాంటి సంఘటనలు ఒక్క సినిమా ఇండస్ట్రీలోనే కాదు పలు చోట్ల ఉన్నాయని చెప్పుకొచ్చింది. అయితే తనకు మాత్రం ఇలాంటి పరిస్థితి ఎన్నడూ ఎదురుకాలేదని చెప్పింది ఆదాశర్మ.

  •  
  •  
  •  
  •  

Comments