బాబోయ్… అదా బట్టలు బాగా ఆదా చేస్తుంది

Saturday, April 28th, 2018, 06:51:09 PM IST

హార్ట్ అటాక్ సినిమాలో అమాయకమైన చూపులతో.. ఆకట్టుకునే చిరునవ్వుతో కట్టిపడేసింది నార్త్ బ్యూటీ అదా శర్మ. అస్సలు ఎక్స్ పోజింగ్ చేయకుండా హోమ్లీ లుక్ తో అదరగొట్టేసింది. క్షణం సినిమాలో కూతురి జాడ తెలియని తల్లి క్యారెక్టర్ లో యాక్టింగ్ కూడా బాగానే చేసిందని అటు ఇండస్ట్రీలో ఇటు అభిమానుల్లో మంచి పేరు తెచ్చుకుంది.

ఈమధ్య ఇటు టాలీవుడ్ లో కానీ.. అటు బాలీవుడ్ లో గానీ పెద్దగా సినిమాలేం లేకపోవడంతో అదా నారూటే సపరేటు అంటూ రూటు మార్చేసింది. హాట్ హాట్ ఫొటో షూట్లతో అందాలన్నీ ఆరబోసేయడం మొదలెట్టింది. లేటెస్ట్ గా టూ పీస్ బికినీ వేసుకుని పడుకుని మేని మెరుపులు మొత్తం చూపిస్తూ కుర్రాళ్ళ మతి పోగొట్టేసింది ఈ స్వప్న సుందరి. అదాను అలా ఒక్క నిమిషం పాటు చూస్తే గుండె కొట్టుకోవట్లేదేమో అన్న అనుమానం వస్తే ఎంతమాత్రమూ తప్పుకాదు. ఇంతకుముందు అదా అందాలు ఆరబోసినా ఈసారి మాత్రం బట్టల విషయంలో ఎంత ఆదా చేయచ్చు అన్నట్లుగా కనిపించి రచ్చ చేసేసింది. ఒక్క అందాల ప్రదర్శనతో సరిపెట్టేస్తే అదా స్పెషాలిటీ ఏముంటుంది? అందుకే సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఈ హాట్ పొటోతో పాటు బికినీ బాడీ రావడానికి ఏం స్టెప్స్ తీసుకోవాలో కూడా చెప్పింది. అదేంటంటే ఒకటి బికినీ తీసుకోవడం.. రెండు తొడుక్కోవడం. అంతే. మొత్తానికి అదా అందమూ అదిరింది.. బికినీ బాడీ ఎలా సంపాదించాలో చెప్పిన విధానమూ అదిరింది.

  •  
  •  
  •  
  •  

Comments