వీడియో : 80 ప్ల‌స్ భామ్మ‌తో కొంటె అదా వెట‌కారం?

Monday, April 9th, 2018, 08:32:55 PM IST

కొంటె వేషాల‌తో తుంట‌రి ప‌నులు చేయ‌డం కొంద‌రికే సాధ్యం. అలాంటి తుంట‌రిత‌నంలో అదాశ‌ర్మ‌ను కొట్టేవాళ్లే లేరు. పూరి డిస్క‌వ‌రీగా `హార్ట్ ఎటాక్‌` సినిమాతో తెలుగులో అడుగుపెట్టిన అదాశ‌ర్మ టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా పాతుకుపోవాల‌ని చాలా ర‌కాలుగా ప్ర‌య‌త్నించింది. కానీ అదా ప‌ప్పులేవీ ఉడ‌క‌లేదు. ఈ ముంబై భామ‌ని మించిన ట్యాలెంటు సౌత్‌లోనే బోలెడంత ఉంద‌ని త‌న‌కే తెలిసొచ్చింది. మ‌ల్లూ భామ‌ల వెల్లువ‌లో త‌నో సైడ్ క్యారెక్ట‌ర్ అయిపోయిందంటే అతిశ‌యోక్తి కానేకాదు. అదా నటించిన స‌న్నాఫ్ స‌త్య‌మూర్తిలో నిత్యా, స‌మంత వంటి స్టార్లు ఆటాడేశారు.

సినిమాల్లేక‌పోయినా, సామాజిక మాధ్య‌మాల ప్ర‌చారంలో అంద‌రికంటే ఓ ఆకు ఎక్కువే తిన్నాన‌ని నిరూపిస్తున్న అదా ఇదివ‌ర‌కూ ఓ త‌మిళ తంబీని ఓ రేంజులో ఆట ప‌ట్టించింది. ఇప్పుడు ఏకంగా 80 ప్ల‌స్ భామ‌తో అదాశ‌ర్మ ప‌రాచికం చూస్తే ఔరా! అని ముక్కున వేలేసుకుంటారు. స‌ద‌రు భామ్మ గారితో స్టెప్పులేయించింది ఈ కొంటె కోనంగి. అంతేనా ఆ స్టెప్పులు ఎంత న్యూడ్‌గా ఉన్నాయో చూస్తే షాక్ తింటారు. ఇదిగో డౌట్‌గా ఉంటే ఈ వీడియో చూడండిక‌.

  •  
  •  
  •  
  •  

Comments