అదా ఈ వేషాలు ఎందుకో తెలుసుకోవ‌చ్చా?

Friday, May 4th, 2018, 11:19:02 PM IST

న‌వ‌త‌రం నాయిక‌ల్లో అదాశ‌ర్మ ప్ర‌త్యేక‌తే వేరు. ఈ భామ ఎక్క‌డ ఉన్నా అక్క‌డ సంథింగ్ స్పెష‌ల్‌గా ఉంటుంది. అల్ల‌రిత‌నంతో కూడుకున్న చిలిపి చేష్ట‌ల‌తో ఈ భామ వేసే కొంటె వేషాలు సంథింగ్ స్పెష‌ల్‌గా ఉంటాయి. అందునా సామాజిక మాధ్య‌మాలు అందుబాటులోకి వ‌చ్చాక‌.. వాటిలో ఈ అమ్మ‌డు చెల‌రేగిపోతున్న తీరు అన్‌లిమిటెడ్‌గా ఉంది. ట్విట్ట‌ర్లో ఎప్ప‌టిక‌ప్పుడు త‌న డ్యాన్సింగ్ స్కిల్స్‌ని ఈ అమ్మ‌డు పోస్ట్ చేస్తూ ఆక‌ట్టుకుంటోంది.

ఈ డ్యాన్సుల్లో చాలా చాలా వెరైటీల్ని ప‌రిచ‌యం చేస్తోంది. ఇదిగో ఈ వీడియో చూశాక మీకే అర్థ‌మ‌వుతుంది. పాశ్చాత్య నృత్యాల్ని ర‌క‌ర‌కాల భంగిమ‌ల‌తో ఎంత మోడ్ర‌న్ గా మార్చేసిందో. అదా స్టెప్పు వేస్తే కుర్ర‌కారు గుండెలు గుభేల్మ‌నాల్సిందే. అన్న‌ట్టు అదాకి ఇలాంటి వేషాల వ‌ల్ల ట్విట్ట‌ర్‌లో అంత‌కంత‌కు ఫాలోయింగ్ పెరుగుతోంది. దీనివ‌ల్ల త‌న‌కు ల‌క్ష‌ల్లో వాణిజ్య ప్ర‌క‌ట‌న‌ల ఆదాయం పెరుగుతుంద‌న‌డంలో సందేహం లేదు. మొత్తానికి అదా వేషాలు ఆ ర‌కంగా ఆదాయం తెచ్చిపెట్ట‌నున్నాయ‌న్న‌మాట‌!