పవన్ కళ్యాణ్ పై సంచలన ఆరోపణలు చేసిన అద్దేపల్లి శ్రీధర్

Saturday, November 9th, 2019, 03:10:28 PM IST

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేస్తున్న పోరాటాల పై అద్దేపల్లి శ్రీధర్ పలు ఆసక్తికర విషయాలని వెల్లడించారు. జనసేన పార్టీ విశాఖపట్టణం లో నిర్వహించిన లాంగ్ మార్చ్ పై పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. భవన నిర్మాణ కార్మికుల కోసం పవన్ కళ్యాణ్ తన వంతు పోరాటాన్ని చేస్తున్నారు. లాంగ్ మార్చ్ నిర్వహించడానికి పవన్ కళ్యాణ్ పలు పార్టీల మద్దతు తీసుకున్నాడు. అయితే పలు పార్టీల మద్దతు తెలిపినప్పటికీ టీడీపీ మాత్రమే పవన్ స్టేజి ని పంచుకున్నారు. వీటి పై అద్దేపల్లి శ్రీధర్ పలు వ్యాఖ్యలు చేసారు.

దత్త పుత్రుడు అని పిలవడానికి గల కారణాన్ని కూడా వివరించారు. లాంగ్ మార్చ్ కి వెళ్లడం ద్వారా టీడీపీ మాత్రమే లాభ పడింది అని అభిప్రాయం వ్యక్తం చేసారు. నవంబర్ 14 న నిర్వహించనున్న చంద్రబాబు నిరసన దీక్షకు పవన్ హాజరైతే ఇక వీరిద్దరి రహస్య బంధం బయట పడే అవకాశం ఉందని అన్నారు. 2014 లో టీడీపీ కి మద్దతు తెలిపిన పవన్ కళ్యాణ్ 2019 లో ఎన్నికల్లో పోటీ చేసి పరాజయం పాలయ్యారు. అయినప్పటికీ టీడీపీ తోనే కలిసి ప్రయాణం చేస్తున్నారని భావించారు. దత్త పుత్రుడు అనే విమర్శలు వచ్చినపుడు వాటికి సమాధానం తన చేతుల్లోనే ఉంటుంది అని అన్నారు.