ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల కోసం అదితీరావ్‌ సేవ‌లు?

Wednesday, March 21st, 2018, 09:23:41 PM IST

హైద‌రాబాద్ న‌వాబుల వంశం నుంచి మోడ‌లింగ్ రంగంలో ప్ర‌వేశించి, అటుపై అన‌తికాలంలోనే టాప్ హీరోయిన్‌గా వెలుగులు విర‌జిమ్ముతున్న మేటి క‌థానాయిక ఎవ‌రు? .. ఈ ప్ర‌శ్న‌కు ఏకైక స‌మాధానం అదితీరావ్ హైదారీ. పేరులోనే హైద‌రాబాద్ ఉంది. శ్రీ‌దేవి, ట‌బు, దియా మిర్జా వంటి తార‌ల‌ త‌ర్వాత హిందీ ప‌రిశ్ర‌మ‌లో వెలుగులు విర‌జిమ్ముతున్న గ్రేట్ స్టార్ హైదారీ. `ప‌ద్మావ‌త్‌-3డి`లో ఖిల్జీ భార్య మెహ‌రున్నీసా పాత్ర‌లో న‌టించి ఆక‌ట్టుకున్న అదితీరావ్ ఇదివ‌ర‌కూ మ‌ణిర‌త్నం `చెలియా` సినిమాతో తెలుగువారికి ప‌రిచ‌య‌మైంది. తాను న‌టించిన తాజా చిత్రం `దాస్ దేవ్‌` (దేవ దాస్‌కి రివ‌ర్స్‌) త్వ‌రలోనే రిలీజ్ కి రెడీ అవుతోంది.

అదితీ సినిమా కెరీర్‌తో పాటు సామాజిక కార్య‌క్ర‌మాలు తాజాగా చ‌ర్చ‌కొచ్చాయి. లేటెస్టుగా హైద‌రాబాద్‌లో ఉన్న ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల అభ్యున్న‌తి కోసం… ఓ స్వచ్ఛంద సంస్థ‌తో క‌లిసి ఫండ్ రైజింగ్ కార్య‌క్ర‌మంలో పాల్గొనేందుకు హైద‌ర‌బాద్ విచ్చేస్తోంద‌ని తెలుస్తోంది. హైద‌రాబాద్ ఫ‌ల‌క్‌నుమా ప్యాలెస్‌- గ్రాండ్ 101 డైనింగ్‌ హాల్‌లో ఈ ఫండ్‌రైజింగ్ ఈవెంట్ జ‌ర‌గ‌నుంది. `టీచ్ ఫ‌ర్ ఛేంజ్‌` పేరుతో స్వ‌చ్ఛంద కార్య‌క్ర‌మాలు న‌డుపుతున్న సంస్థ ఈ కార్య‌క్ర‌మం నిర్వ‌హిస్తోంది. రాజ‌ధానిలో దాదాపు 100 ప్ర‌భుత్వ స్కూళ్లలో `టీచ్ ఫ‌ర్ ఛేంజ్` స్వ‌చ్ఛంద సామాజిక కార్య‌క్రమం అమ‌ల‌వుతోంది. ఈ కార్య‌క్ర‌మాన్ని ప‌రిపుష్టం చేసేందుకు ఇలా నిధి సేక‌రిస్తున్నార‌న్న‌మాట‌.