ఆదిత్య 369 సీక్వెల్ .. టాప్ సీక్రెట్ లీక్!

Wednesday, June 6th, 2018, 02:01:53 AM IST

యువ‌ర‌త్న నంద‌మూరి బాల‌కృష్ణ న‌టించిన ఆదిత్య 369 ఎంత‌టి సెన్సేష‌నో తెలిసిందే. టైమ్ మెషీన్ నేప‌థ్యంలో తెర‌కెక్కిన ఈ చిత్రం విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు అందుకుంది. ఇప్ప‌టికీ బుల్లితెర టీఆర్‌పీలు అందుకుంటున్న గ్రేట్ మూవీ ఇది. లెజెండ్ సింగీతం శ్రీ‌నివాస‌రావు అద్భుత ద‌ర్శ‌క‌త్వ ప్ర‌తిభ ఆడియెన్‌ని కొత్త లోకాల‌కు తీసుకెళ్లింది. అలాంటి గొప్ప చిత్రానికి సీక్వెల్ తెర‌కెక్కిస్తార‌ని అభిమానులు చాలా కాలంగా వేచి చూస్తున్నారు. అయితే ఎందుక‌నో ఈ సినిమా గురించి అనుకున్న ప్ర‌తిసారీ వాయిదా ప‌డింది. న‌ట‌సింహా నంద‌మూరి బాల‌కృష్ణ సైతం ఆ ప్రాజెక్టును సీరియ‌స్‌గా తీసుకున్న‌ట్టు క‌నిపించ‌లేదు. అప్ప‌ట్లో సింగీతం శ్రీ‌నివాస‌రావు ఈ చిత్రాన్ని తెర‌కెక్కించేందుకు ఆసక్తి క‌న‌బ‌రిచారు. కానీ నిర్మాత‌లు, బాల‌య్య సీరియ‌స్‌గా తీసుకోలేదు.

ఇదే విష‌య‌మై ఆదిత్య 369 నిర్మాత శివ‌లెంక కృష్ణ ప్ర‌సాద్‌ని అడిగితే .. సీక్వెల్ చిత్రం తెర‌కెక్కించేందుకు నేను సానుకూలంగా లేను. చేద్దామ‌ని న‌న్ను అడిగారు. కానీ అలాంటి గొప్ప సినిమాకి సీక్వెల్ అంటే ఎంతో ఆలోచించాను. కుద‌ర‌ద‌ని చెప్పేశాను. దాంతో వేరే నిర్మాత‌లు ఆ చిత్రానికి సీక్వెల్ చేయాల‌ని ప్ర‌య‌త్నించారు. కానీ ఏదీ కుద‌ర‌లేదు. .. అని తెలిపారు. మోక్ష‌జ్ఞ హీరోగా తీయొచ్చు క‌దా!? అన్న ప్ర‌శ్న‌కు సింగీతం ప‌ర్య‌వేక్ష‌ణ‌లో న‌వ‌త‌రం ద‌ర్శ‌కుడు ఎవ‌రైనా తెర‌కెక్కిస్తే బావుంటుంద‌ని అన్నారు. అయితే క‌థ రెడీ కావాలి. చాలా క‌స‌ర‌త్తు చేయాల్సి ఉంటుందని.. అయితే ఆ క్లాసిక్‌ని ట‌చ్ చేసే ఆలోచ‌న లేద‌ని శివ‌లెంక తెలిపారు. ఆయ‌న తెర‌కెక్కించిన స‌మ్మోహ‌నం ఈ వారంలో రిలీజ‌వుతున్న సంద‌ర్భంగా విలేక‌రుల‌తో మాట్లాడుతూ పై వివ‌రాలు అందించారు.

  •  
  •  
  •  
  •  

Comments