బిగ్ న్యూస్: ఇకపై రైల్వే ప్రయాణం చేసేవారు తప్పక తెలుసు కోవాల్సిన విషయాలు ఇవే!

Sunday, May 31st, 2020, 04:47:34 PM IST


ఎట్టకేలకు లాక్ డౌన్ సడలింపు కారణం గా రైలు ప్రయాణాలకు గ్రీన్ సిగ్నల్ లభించింది. అయితే వీటికి సంబంధించిన పలు కీలక విషయాలు మనం కొన్ని తెలుసుకోవాల్సి ఉంది. జూన్ ఒకటవ తేదీ నుండి రైలు ప్రయాణం చేసేవారు తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు ఏమిటో మనం ఇపుడు చూద్దాం.

కరోనా వైరస్ మహమ్మారి కారణంగా ప్రతి ఒక్కరూ భౌతిక దూరం తప్పక పాటించాల్సిందే, అయితే కరోనా వైరస్ ను అరికట్టడానికి రైలు ప్రయాణం కోసం మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంది.

మనం ప్రయాణించే సమయానికి ముందుగా స్టేషన్ కి చేరుకోవాలి. గంటన్నర అనగా, 90 నిమిషాలకు ముందుగా మనం రైల్వే స్టేషన్ కి చేరుకోవాలి. వీలైనంత తక్కువ లగేజీ ను తీసుకు వెళ్ళాలి. సరైన రేజర్వేశన్ టికెట్ ఉంటేనే ప్రయాణం సాధ్యం అవుతుంది. రైల్వే స్టేషన్ నుండి లోపలికి, బయటికి వెళ్లేందుకు ప్రత్యేక మార్గాలను ఏర్పాటు చేయడం జరిగింది. వాటి ను మాత్రమే ఉపయోగించాల్సి ఉంది. థర్మల్ స్క్రీనింగ్ లో అందరూ పాల్గొనాల్సి ఉంది, అనారోగ్యం పాలు అయిన వారు ప్రయాణం చేయడానికి కుదరదు.

అయితే ఈ స్క్రీనింగ్ లో కరోనా వైరస్ లక్షణాలు కనిపిస్తే ప్రయాణానికి అనుమతి ఉండదు. పూర్తి టికెట్ ధర డబ్బులు వస్తాయి.అయితే దీర్ఘ కాలిక వ్యాధులతో బాధ పడే వారు, వృద్దులు, గర్భిణీ స్త్రీలు, పిల్లలు అత్యవసరం అయితే తప్ప ప్రయనం చేయకూడదు. ఆరోగ్య ప్రోటోకాల్ తప్పనిసరిగా పాటించాలి. మాస్క్ లు తప్పకుండా ధరించాలి, అంతేకాక అక్కడే అందుబాటులో ఉన్న సానిటైజార్ ను ఉపయోగించా లి. ప్రయాణ పరిసర ప్రాంతాలను శుభ్రంగా ఉంచాలి. ప్రజలు తమ ఆహారం వెంట తెచ్చుకోవడం శ్రేయస్కరం, అలానే ప్రతి ఒక్కరూ ఆరోగ్య సేతు అప్లికేషన్ ఉపయోగించాలి.