గాళ్స్ హైఎలెర్ట్‌: బాబా నాలుక నాకితే, జ్ఞానం ల‌భించును!

Monday, September 25th, 2017, 02:17:22 PM IST

ఇటీవ‌లి కాలంలో దొంగ బాబాల గుట్టు రట్ట‌వుతున్న సంగ‌తి తెలిసిందే. గుర్మీత్ రామ్ ర‌హీం బాబా అలియాస్ డేరా బాబా క‌ట‌క‌టాల్లోక వెళ్ల‌డంతో ఒక్కో దొంగ బాబా చిట్టా ర‌ట్టు చేసే పనిలో ప‌డ్డారు జ‌నం. ఆ క్ర‌మంలోనే .. సంత్ ఆశారామ్ బాపు, గురు రాంపాల్ దాస్, బాబా జై గురుదేవ్.. దారుణాలు బయటకు తీస్తున్నారు.

ఈ జాబితాలో మ‌రో కొత్త పేరు వేగంగా పాపుల‌రైందిప్పుడు. కౌసలేంద్ర ప్రపన్నాచార్య అలియాస్ ఫలహారీ బాబా చిలిపి చేష్ట‌ల‌పై మీడియాలో ప‌లు క‌థ‌నాలు వెలువ‌డుతున్నాయి. `నా నాలుకపై తేనెతో ఓం అనే బీజాక్షరం రాస్తా.. నువ్వు దానిని నాకితే నాలోని జ్ఞానం నీకు ప్రసారమవుతుంది.. ఇలాగే ఎంద‌రికో జ్ఞానం ప్ర‌సాదించాను“ అంటూ స‌ద‌రు బాబా 21 ఏళ్ల లా విద్యార్థినికి బిస్కెట్ వేయ‌డం ప్ర‌ముఖంగా చ‌ర్చ‌కొచ్చింది. స‌ద‌రు విద్యార్థిని పోలీసుల‌ను సంప్ర‌దించి ఎఫ్ఐఆర్ లో పైవిధంగా పేర్కొన‌డంతో బాబా గుట్టు బ‌య‌ట‌కు లీకైంది. త‌న‌ను నాలుక నాకాల్సిందేనని పట్టుబట్టాడని, గ‌దిలో ఒంట‌రిగా ఉంచి.. అటుపై లైంగిక దాడికి పాల్ప‌డ్డాడ‌ని స‌ద‌రు యువ‌తి పేర్కొంది. త‌న‌ని ఎక్కడెక్కడో తాకుతూ.. చెడు చేష్ట‌లు చేయ‌డంతో.. తాను ఏమీ చేయలేక బిగ‌దీసుకుపోయాన‌ని స‌ద‌రు యువ‌తి మ‌నోవేద‌న‌తో వెల్ల‌డించింది. భ‌గ‌వంతుడి ఆదేశాలు అంటూ త‌న‌పై లైంగిక దాడికి య‌త్నించాడ‌ని ఆరోపించింది. ఈ ఘోరంపై కొన్ని రోజులపాటు ఎవరికీ చెప్పుకోలేకపోయాన‌ని, చివరికి తల్లిదండ్రులకు చెప్పడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారని తెలిపింది. బాధితురాలి ఫిర్యాదుతో కౌసలేంద్ర ప్రపన్నాచార్య అలియాస్ ఫలహారీ బాబా (60)ను అరెస్ట్ చేసిన పోలీసులు జైలుకు పంపారు. స‌ద‌రు బాబా ప్ర‌స్తుతం క‌ట‌క‌టాల్లో ఊచ‌ల్లెక్కిస్తున్నారు.

Comments