చాన్నాళ్లకు తెలంగాణ ప్రభుత్వం పై ప్రశంసలు..!

Monday, July 13th, 2020, 08:05:49 AM IST

కరోనా ధాటి విషయంలో ఇపుడు మన రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల పని తీరు ఎలా ఉందో అందరికీ ఇపుడు ఒక తెరిచిన పుస్తకం. అయితే ఏపీలో జగన్ ప్రభుత్వం భారీ ఎత్తున టెస్టులు చేస్తుంది అని ప్రశంసలు ఉన్నా మరోపక్క కట్టడి చెయ్యడంలో వైఫల్యం చెందింది అని విమర్శలు ఉన్నాయి.

ఇక కేసీఆర్ విషయానికి వస్తే ఆయన మాటల ముఖ్యమంత్రే అని మరోసారి నిరూపితం అయ్యింది. కరోనా అక్కడ ప్రబలుతున్న మొదట్లో కేసీఆర్ ఇచ్చిన భరోసా చూసి ఏదో అనుకున్నారు. కానీ ఇంకేదో జరిగింది. దీనితో గత కొన్ని రోజుల నుంచి కేసీఆర్ పై ఒక్కసారిగా సెటైర్లు మరియు విమర్శలు గట్టిగా పడుతున్నాయి.

కానీ ఇప్పుడు చాలా రోజులకు కేసీఆర్ ప్రభుత్వం పై నెటిజన్స్ నుంచి ప్రశంసలు వస్తున్నాయి. అక్కడి కేసుల సంఖ్యను కట్టడి చెయ్యడానికి హోమ్ ఐసోలేషన్ ను ప్రారంభించారు. అందుకు తగ్గట్టుగా హోమ్ ఐసోలేషన్ కిట్లను అందిస్తున్నారు.

కనీసం దానిపై కేసీఆర్ బొమ్మ కూడా లేకుండా మందులు, మాస్కులు, హ్యాండ్ వాష్ మరియు శానిటైజర్ లు గ్లౌస్ లు అలాగే హోమ్ ఐసోలేషన్ కు సంబంధించిన ఒక పుస్తకాన్ని అందులో అందిస్తున్నారు. దీనితో కేసీఆర్ తీసుకున్న ఈ నిర్ణయం పై సర్వత్రా ప్రశంసలు వినిపిస్తున్నాయి.