హైదరాబాద్‌లో భారీగా కంటైన్‌మెంట్ జోన్లు.. ఎక్కడెక్కడంటే?

Tuesday, July 28th, 2020, 02:28:26 PM IST

తెలంగాణలో కరోనా కేసులు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. అయితే ప్రతి రోజు నమోదవుతున్న కేసులలో దాదాపు సగం కేసులు హైదరాబాద్ పరిసర ప్రాంతాలలోనే నమోదవుతున్నాయి. అయితే మొన్నటి వరకు హైదరాబాద్‌లో తిరిగి లాక్‌డౌన్ విధించబోతున్నారన్న ప్రచారం జరిగినా అది ఇక జరిగేలా కనిపించడం లేదు.

అయితే ఇప్పటికే హైదరాబాద్‌లో కరోనా పరీక్షలను పెంచిన ప్రభుత్వం కరోనా కేసులను అదుపులోకి తెచ్చేందుకై భారీగా కంటైన్మెంట్ జోన్లు ఏర్పాటు చేసింది. జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్న 6 జోనల్ కార్యాలయాల పరిధిలో 90కి పైగా కంటైన్మెంట్ ప్రాంతాలను ప్రకటించారు. ఖైరతాబాద్ జోన్‌లో 13, సికింద్రాబాద్ జోన్‌లో 23, శేర్లింగంపల్లిలో 10, కూకట్‌పల్లి జోన్‌లో 9, ఎల్బీనగర్ జోన్‌లో 5, చార్మినార్ జోన్‌లో 31 కంటైన్మెంట్ జోన్లను ఏర్పాటు చేశారు.