అబ్బాయ్ బాబాయ్ మ‌ధ్య మ‌ళ్లీ తేడాలు!

Thursday, June 6th, 2019, 09:30:20 AM IST

అబ్బాయ్..బాబాయ్ మ‌ధ్య మ‌ళ్లీ తేడాలు వ‌చ్చాయా?. త‌ను ఆశిస్తున్న ఎంపీ స్థానాన్ని కాద‌ని వైఎస్ జ‌గ‌న్ బాబాయ్ వైవీ సుబ్బారెడ్డికి టీటీడీ ప‌ద‌వి క‌ట్ట‌బెడుతున్నారా?. అంటే వైసీపీ వ‌ర్గాల్లో నిజ‌మ‌నే వాద‌న వినిపిస్తోంది. టీటీడీ ప‌ద‌విని విశాఖ శార‌దా పీఠం అధిప‌తి స్వారూపానందేంద్ర‌కు క‌ట్ట‌బెడ‌తార‌ని ప్ర‌చారం జ‌రిగింది. అయితే ఆ ప‌ద‌విని త‌న బాబాయ్ వైవీ సుబ్బారెడ్డికి క‌ట్ట‌బెట్టాల‌ని జ‌గ‌న్ ఆలోచిస్తున్న‌ట్లు తాజాగా తెలుస్తోంది. అయితే అది వైవీ సుబ్బారెడ్డికి ఏమాత్రం ఇష్టం లేద‌ని, ఆయ‌న టీటీడీ ప‌ద‌విపై సుముఖంగా లేర‌ని చెబుతున్నారు.

వైవీ సుబ్బారెడ్డి రాజ్య‌స‌భ సీటును ఆశిస్తున్నారు. అయితే ప్ర‌స్తుతానికి టీటీడీ ఛైర్మ‌న్ ప‌ద‌వితో స‌ర్దుకోవాల‌ని, అవ‌కాశాన్ని బ‌ట్టి రాజ్య‌స‌భ‌కు పంపిస్తాన‌ని జ‌గ‌న్ ఆయ‌న‌ను బుజ్జిగిస్తున్నార‌ని పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. గ‌త ఎన్నిక‌ల్లో వైవీ సుబ్బారెడ్డి ఒంగోలు ఎంపీగా గెలుపొందారు. అయితే ఆ స్థానాన్ని జ‌గ‌న్ కోసం త్యాగం చేయాల్సి వ‌చ్చింది. దాంతో కొంత అల‌క బూనిన వైవీ సుబ్బారెడ్డి ప్ర‌చారానికి ముందు విదేశాల‌కు వెళ్లారు. తిరిగి వ‌చ్చిన ఆయ‌న‌ను జ‌గ‌న్ బుజ్జ‌గించ‌డంతో మ‌ళ్లీ పార్టీ కార్య‌క‌లాపాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. అయితే తాజాగా జ‌గ‌న్ టీటీడీ ఛైర్మ‌న్ ప‌ద‌విని ఆఫ‌ర్ చేయ‌డంతో మ‌ళ్లీ ఇద్ద‌రి మ‌ధ్య మ‌న‌స్ప‌ర్థ‌లు పెరిగే అవ‌కాశం వుంద‌ని పార్టీ వ‌ర్గాల్లో చ‌ర్చ‌జ‌రుగుతోంది.