బులెటిన్‌లో మార్పులేవి.. తెలంగాణ సర్కార్‌పై హైకోర్టు మరోసారి సీరియస్..!

Monday, July 27th, 2020, 02:50:28 PM IST

తెలంగాణ సర్కార్‌పై హైకోర్ట్ మరోసారి మండిపడింది. కరోనా కేసుల్లో తమ ఆదేశాలు అమలు కావడం లేదని, కేసుల సంఖ్యలో కూడా అవకతవకలు ఉన్నాయంటూ ఇదివరకే సీరియస్ అయ్యింది. అయితే కరోనాకు సంబంధించి పూర్తి వివరాలు బులెటిన్‌లో ఉండేలా చూసుకోవాలని, ఆసుపత్రులలో బెడ్లు, వెంటిలేటర్ల వంటి సమాచారం కూడా క్లుప్తంగా ఉండాలని చెబుతూనే వస్తుంది.

అయితే హైకోర్ట్ పదేపదే మొట్టికాయలు వేస్తుండడంతో మొన్న కరోనా బులెటిన్ విడుదల చేయకుండా, నిన్న కొత్త ఫార్మాట్‌లో బులెటిన్ విడుదల చేసింది. అయితే నిన్న విడుదల చేసిన కరోనా బులెటిన్‌లో కూడా సరైన వివరాలు లేవని హైకోర్ట్ మరో సారి సర్కార్‌పై సీరియస్ అయ్యింది. తమ ఆదేశాలు అమలు చేయడం కష్టమైతే ఎందుకో చెప్పాలని ప్రశ్నించింది. కరోనా విషయంలో ఏం చేయమంటారో రేపు సీఎస్‌నే అడుగుతామని చెబుతూ ఈ కేసులన్నింటిపై విచారణను రేపటికి వాయిదా వేసింది.