మరోసారి పవర్ ఫుల్ పోలీస్ పాత్రలో మాస్ మహారాజా!

Thursday, January 25th, 2018, 02:54:05 PM IST


మాస్ మహారాజా రవితేజ ఇటీవలి చిత్రం రాజా ది గ్రేట్ చిత్రం తో మళ్ళి ఫామ్ లోకి వచ్చారు. అందులో ఆయన చేసిన అంధుడి పాత్ర అందరిని బాగా అలరించింది. అయితే ఆ చిత్రం విజయం తరువాత ఆయన తన తదుపరి చిత్రాలు ఆచి తూచి చేస్తున్నారనే చెప్పాలి. కెరీర్ ఇక పై పక్కాగా ప్లాన్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నట్లు తెలుస్తోంది. విక్రమార్కుడు చిత్రం లో ఆయన చేసిన విక్రమ్ రాథోడ్ పాత్ర ఆయన కెరీర్ లోనే బెస్ట్ పెర్ఫార్మన్స్ గా చెప్పవచ్చు. ఆ పాత్రలో రవితేజ నటన అద్భుతమనే చెప్పాలి. అయితే ఆతరువాత ఆయన పవర్ చిత్రం లో కూడా బల్దేవ్ సహాయ్ పాత్రలో కూడా మంచి నటన కనబరిచారు, నటన పరంగా ఆయనకు మంచి మార్కులే పడ్డా చిత్రం మాత్రం అనుకున్నంత విజయవంతం కాలేదు. మళ్ళి ఇన్నాళ్లకు ఆయన తన నూతన చిత్రం టచ్ చేసి చూడు లో మరోసారి పవర్ఫుల్ పోలీస్ పాత్ర లో నటిస్తున్నారట. సినిమా చాలా వరకు ఓల్డ్ సిటీ బ్యాక్ డ్రాప్ లో సాగుతుందని, అక్కడ వున్న పెద్ద రాజకీయ నాయకులను ఢీకొనే పోలీస్ ఆఫీసర్ పాత్ర చేస్తున్నారట. ఆ సీన్ లు చిత్రం లో హైలైట్ అవుతాయని తెలియవస్తోంది. సెన్సార్ కార్యక్రమాలను పూర్తిచేసుకున్న ఈ చిత్రం త్వరలో ప్రీ రిలీజ్ వేడుకకు సిద్ధమవుతోంది. రాశి ఖన్నా, సీరత్ కపూర్ కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రం ద్వారా విక్రమ్ సిరికొండ దర్శకునిగా పరిచయం అవుతున్నారు. ఫిబ్రవరి 2 న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది….