మళ్ళీ పోలీసుల కస్టడీలోకి దిశ నిందితులు.. కారణం అదేనా..!

Wednesday, December 4th, 2019, 02:24:47 AM IST

వెటర్నరి మహిళా డాక్టర్ దిశ రేప్ అండ్ మర్డర్ కేసు తెలుగు రాష్ట్రాలలో సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే నింధితులను కఠినంగా శిక్షించాలంటూ దేశమంతటా పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. అయితే దిశ హత్య కేసులో నింధితులను 10 రోజుల పాటు న్యాయస్థానం పోలీసుల కస్టడీకి అప్పగించింది. ఈ కేసులో నిందితులను మరింత విచారణ చేయాలని షాద్ నగర్ పోలీసులు పిటిషన్‌ దాఖలు చేశారు.

అయితే ఈ పిటీషన్‌పై స్పందించిన న్యాయస్థానం నలుగురు నింధితులను పోలీసుల కస్టడీకి అప్పగించింది. అయితే విచారణలో భాగంగా దిశా మొబైల్ ఫోన్‌ను, నిందితుల వాంగ్మూలంను రికార్డు చేయాల్సి ఉందని పోలీసులు న్యాయస్థానానికి వెల్లడించారు. అయితే ప్రస్తుతం చర్లపల్లి జైల్లో ఉన్న నలుగురు నిందితులను షాద్ నగర్ పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు.