ఎగ్రెస్సివ్ హీరో.. ఫ్యాన్స్‌ని మెడ‌ప‌ట్టి గెంటాడిలా!

Wednesday, March 14th, 2018, 08:00:48 PM IST

బాలీవుడ్ మేటి క‌థానాయ‌కుడు.. ఎన‌ర్జిటిక్ హీరో ర‌ణ‌వీర్ సింగ్ ప‌ద్మావ‌త్ స‌క్సెస్‌ని ఆస్వాధిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా త‌ర్వాత‌ గ‌ల్లీబోయ్స్ చిత్రంలో న‌టిస్తున్నాడు. రోహిత్ శెట్టి ద‌ర్శ‌క‌త్వంలో `సింబా`, అలానే క‌పిల్ దేవ్ బ‌యోపిక్ క్యూలో ఉన్నాయి. ఇదిలా ఉండ‌గానే ర‌ణ‌వీర్ జిమ్ముల్లో రెగ్యుల‌ర్‌గా క‌స‌ర‌త్తులు చేస్తూ రూపం మార్చుకునే ప‌నిలో ప‌డ్డాడు. త‌దుప‌రి ప్రాజెక్టుల‌క‌నుగుణంగా అత‌డు షేపులు త‌యారు చేస్తున్నాడు.

అలా ఓసారి జిమ్‌లోంచి బ‌య‌టికి వ‌చ్చిన ర‌ణ‌వీర్‌పైకి ఫ్యాన్స్ లంఘించారు. అత‌డితో సెల్ఫీ దిగేందుకు పోటీప‌డ్డారు. ఓ పెద్ద క్యూనే త‌యారైంద‌క్క‌డ‌. అయితే ఆ క్యూలో ఒక్కొక్క‌రితో ర‌ణ‌వీర్ సెల్ఫీ దిగుతూ వారిని పంపించాడు. కానీ అంత‌మంది ఫ్యాన్స్ లో ఒక‌డు మాత్రం మీద‌ప‌డి ప‌దే ప‌దే సెల్ఫీలు దిగుతుండ‌డంతో బాగా మండిన ర‌ణ‌వీర్ అత‌డిని చేత్తో తోశాడు. ఆ త‌ర్వాత ఒక్కో ఫ్యాన్‌కి చ‌క‌చ‌కా సెల్పీ ఇచ్చి అదే ప‌నిగో మెడ‌ప‌ట్టి ఎలా గెంటాడో మీరే చూడండి. వాస్త‌వానికి మంట పుట్టించినోడు అభిమాని. హ‌డావుడి చేసింది బాలీవుడ్ మీడియా. ఏదోలా టీఆర్పీ గోల‌లో ప‌డే ఉత్త‌రాది మీడియా ఈ స‌న్నివేశంలో ర‌ణ‌వీర్‌ని నిజంగానే ఖిల్జీని చేసింది. మీరూ చూడండి ఈ చూడ‌చ‌క్క‌ని నిక్క‌రు ర‌ణ‌వీరుడిని….